For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ రిఫరీ ట్విస్ట్.. విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు షాక్!!

South Africa vs England: England Fined 20 Per Cent Match Fees For Slow Over-Rate

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్ష ఛేదనలో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (22 బంతుల్లో 57 నాటౌట్‌; 7 సిక్స్‌లు) ఆడడంతో ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచ్ విజయంతో రెండు నెలల దక్షిణాఫ్రికా పర్యటనను ఇంగ్లండ్‌ ఘనంగా ముగించింది. టెస్టు సిరీస్‌ను 3-1తో, టీ20 సిరీస్‌ను 2-1తో గెల్చుకున్న ఇంగ్లండ్‌.. వన్డే సిరీస్‌ను మాత్రం 1-1తో సమం చేసుకుంది.

మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత

మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత

విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాక్ ఇచ్చింది. మూడో టీ20లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకుగానూ ఇంగ్లండ్‌ జట్టులోని ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ తక్కువగా వేయడంతో.. ఆ జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌ నిర్ణయం తీసుకున్నారు.

తప్పు అంగీకరించిన మోర్గాన్

తప్పు అంగీకరించిన మోర్గాన్

ఇంగ్లండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ, వాదనలు ఉండవని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఐసీసీ నిబంధనల ప్రకారం కోత విధించాం. ఓవర్‌కు 20 శాతం చొప్పున.. ఇంగ్లండ్‌ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత వేశాం' అని ఐసీసీ తెలిపింది. ఇక ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్‌ 2.22 ప్రకారం ప్రతి ఓవర్‌ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారనే విషయం తెలిసిందే.

క్లాసెన్‌ క్లాస్

క్లాసెన్‌ క్లాస్

మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (33 బంతుల్లో 66; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), తెంబా బవుమా (24 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), క్వింటన్ డికాక్‌ (24 బంతుల్లో 35; ఫోర్, 4 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. టామ్ కర్రాన్‌, బెన్ స్టోక్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మోర్గాన్ విధ్వంసం

మోర్గాన్ విధ్వంసం

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసి గెలుపొందింది. జోస్‌ బట్లర్‌ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఇక మోర్గాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 24 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో మోర్గాన్‌, స్టోక్స్‌ కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో కలిపి 52 పరుగులు చేసారు. అద్భుత ఆటతో ఆకట్టుకున్న మోర్గాన్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా నిలిచాడు.

Story first published: Monday, February 17, 2020, 18:30 [IST]
Other articles published on Feb 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+