5 వికెట్లతో విజృంభించిన అండర్సన్‌.. పట్టుబిగించిన ఇంగ్లండ్‌!!

కేప్‌టౌన్‌: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్.. రెండో టెస్టులో లెక్కసరిచేసే దిశగా ముందుకు సాగుతోంది. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇప్పటికే ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. మొదటగా స్టార్ పేసర్ జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డామ్ సిబ్లీ (85 బ్యాటింగ్‌; 13 ఫోర్లు), కెప్టెన్ జో రూట్‌ (61; 7 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో... ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం.. స్టార్ క్రికెటర్‌కు భారీ జరిమానా!!

ఓవర్‌నైట్ స్కోరు 215/8తో మూడో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా.. మరో 8 పరుగులు చేసి ఆలౌటైంది. రబడ (0), నోర్జే (4)ను ఆండర్సన్ (5/40) ఔట్ చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ ఘనంగా ఆఆరంబించింది. ఓపెనర్ క్రాలే (25) ఆరంభంలో ఎడాపెడా బౌండరీలు బాదినా త్వరగానే ఔటవడంతో.. ఇంగ్లండ్ ఒక దశలో 28/1తో నిలిచింది. డెన్లీ (31) సహకారంతో సిబ్లే.. జట్టు స్కోరును వంద దాటించాడు.

డెన్లీ ఔట్ అయిన అనంతరం రూట్ క్రీజులోకి రావడంతో ఇన్నింగ్స్ జోరందుకుంది. సిబ్లే-రూట్ ప్రొటీస్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకునడిపారు. ఈ క్రమంలోనే మొదటగా సిబ్లే హాఫ్ సెంచరీ చేయగా.. ఆ తర్వాత రూట్ కూడా అర్ధ శతకం బాదాడు. ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న రూట్ సేన ఓవరాల్‌గా 264 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీ బౌలర్లలో నోర్జే 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 269 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో ఎన్రిచ్ నోర్జే క్యాచ్ పట్టడం ద్వారా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లు పట్టిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఐదు క్యాచ్‌లు అతడు రెండో స్లిప్‌లోనే పట్టడం మరో విశేషం. ఇంగ్లిష్ జట్టు ఇదివరకు ఆడిన 1,019 టెస్టుల్లో 23 మంది ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో 4 కాచులు పట్టారు. ఐదు క్యాచ్‌లు ఇదే మొదటిసారి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 6, 2020, 9:28 [IST]
Other articles published on Jan 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X