చివరి ఓవర్లో ఎంగిడి అద్భుతమైన బౌలింగ్.. ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా అనూహ్య విజయం!!

ఈస్ట్‌లండన్ (సౌతాఫ్రికా): సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా అనూహ్య విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ప్రొటీస్ పేసర్ లుంగి ఎంగిడి అద్భుతమైన బౌలింగ్‌తో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. బఫెల్లో పార్క్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఉంత్కంఠ పోరులో చివరకు సౌతాఫ్రికా ఒక్క పరుగుతో విజయం సాధించింది.

రాణించిన బవుమా:
తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్ తెంబ బవుమా (43; 27 బంతుల్లో 5x4), కెప్టెన్ క్వింటన్ డికాక్ (31; 15 బంతుల్లో 3x4, 2x6) రాణించారు. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. మిగతా బ్యాట్స్‌మన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. వాన్ డెర్ డుసెన్ (31) పర్వాలేదనిపించగా.. డేవిడ్ మిల్లర్ (16), జెజె స్మట్స్ (20) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసాడు.

రాయ్ హాఫ్ సెంచరీ:
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ సునాయాస విజయం సాధించేలా కనిపించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (15) త్వరగానే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (70; 38 బంతుల్లో 7x4, 3x6) జానీ బెయిర్‌స్టో (23)తో కలిసి దూకుడుగా ఆడాడు. బెయిర్‌స్టో అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (52; 34 బంతుల్లో 7x4, 1x6) చెలరేగాడు. మోర్గాన్ అండతో రాయ్ హాఫ్ సెంచరీ చేసాడు.

మోర్గాన్ ఒంటరి పోరాటం:
రాయ్ నిష్క్రమణ అనంతరం జో డెన్లీ (3), బెన్ స్టోక్స్ (4) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే మోర్గాన్ మాత్రం ఒంటరి పోరాటం చేసాడు.ఇక ఇంగ్లాండ్ విజయానికి చివరి ఏడు బంతుల్లో ఏడు పరుగులు అవసరమయ్యాయి. హిట్టర్ మోర్గాన్ క్రీజులో ఉన్నాడు. దీంతో ఇంగ్లాండ్ విజయం ఖాయమనే భావించారంతా. అయితే హెడ్రిక్స్ వేసిన 18.6 బంతికి మోర్గాన్ క్యాచ్ ఔట్ ఔటయ్యాడు. దీంతో చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు ఏడు పరుగులు అవసరమయ్యాయి.

ఒక బంతి.. మూడు పరుగులు:
చివరి ఓవర్లో ఎంగిడి వేసిన తొలి బంతికి రెండు పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి టామ్ కరన్ (2) ఔట్ అయ్యాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతికి మోయిన్ అలీ రెండు పరుగులు తీశాడు. ఐదో బంతికి మోయిన్ అలీ (5) బౌల్డయ్యాడు. దీంతో సమీకరణం ఒక బంతికి మూడు పరుగులుగా మారింది. ఆరో బంతికి అదిల్ రషీద్ (1) రెండో పరుగుకోసం యత్నించగా రనౌటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఒక పరుగు తేడాతో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications