For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022లో అప్పుడే రెండు మ్యాచ్‌లు రద్దు..!!

South Africa Vs Bangladesh match called off due to rain, while Pakistan vs Afghan no result

బ్రిస్బేన్: ఊహించినట్టే- టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ను వర్షం వెంటాడుతోంది. దీని ప్రభావం అప్పుడే మొదలైంది కూడా. సూపర్ 12 దశ ఆరంభం కావడానికి ఇంకో 48 గంటలు మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. లా నినా ప్రభావంతో మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్.. వంటి నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకొద్ది రోజుల పాటు కొనసాగుతుందని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది.

తొలి రెండు మ్యాచ్‌లపైనా..

తొలి రెండు మ్యాచ్‌లపైనా..

ఆస్ట్రేలియా ఈశాన్య ప్రాంతం మీదుగా లా నినా విస్తరించింది. వచ్చే నాలుగైదు రోజుల్లో ఇది మరింత విస్తృతమౌతుందని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ వివరించింది. మెల్‌బోర్న్‌ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడానికే అధిక అవకాశాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు.. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్‌ కూడా రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

మెల్‌బోర్న్‌లో..

మెల్‌బోర్న్‌లో..

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు జరగాల్సిన మొట్టమొదటి మ్యాచ్ ఇది. సిడ్నీలో శనివారం వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నాయని బ్యూరో ఆఫ్ మెటెరాలజీ తెలిపింది. మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావొచ్చనీ అంచనా వేసింది. మెల్‌బోర్న్‌లో రాత్రి వేళ 10 నుంచి 25 మిల్లీమీటర్ల వరకు వర్షం పడటానికి 90 శాతం వరకు అనుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడించింది.

 ఆలస్యంగా వామప్..

ఆలస్యంగా వామప్..

దీనికి ముందస్తు సూచిక అన్నట్టుగా ఇవ్వాళ జరగాల్సిన భారత్-న్యూజిలాండ్ వామప్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉంది. బ్రిస్బేన్‌లో భారీ వర్షం పడటం వల్ల ఆలస్యంగా టాస్ పడనుంది. సాయంత్రం 4:30 గంటలకు టాస్ పడే అవకాశం ఉంది.. అప్పటికీ వాతావరణం సహకరిస్తేనే. లేదంటే పూర్తిగా రద్దు అవుతుందీ మ్యాచ్.

రెండూ రద్దు..

రెండూ రద్దు..

బ్రిస్బేన్‌లోనే షెడ్యూల్ అయిన దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దయింది. ఒక్క బంతి కూడా పడే పరిస్థితి లేకపోవడం వల్ల మ్యాచ్ మొత్తానికే రద్దయింది. ఇక పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 2.2 ఓవర్లల్లో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్‌‌ను రద్దు చేశారు.

రిజర్వ్ డే ఇలా..

రిజర్వ్ డే ఇలా..

టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్స్, సూపర్ 12 దశలో రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మ్యాచ్ కొనసాగాలంటే కనీసం అయిదు ఓవర్లయినా పడాల్సి ఉంటుంది. అయిదు ఓవర్లు కూడా వేయలేని పరిస్థితి ఉంటే మ్యాచ్‌ రద్దవుతుంది. ఫలితంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌పై ఇప్పటి నుంచే అనుమానాలు ఏర్పడుతున్నాయి.

Story first published: Wednesday, October 19, 2022, 14:30 [IST]
Other articles published on Oct 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+