
చెలరేగిన తస్కిన్ అహ్మద్
మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 37 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ పేస్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 5 వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. బంగ్లా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా ఓపెనర్ జననేమన్ మలన్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో మహారాజ్ 28, ప్రిటోరియస్ 20, మిల్లర్ 16, డికాక్ 12, వెర్రెయిన్నే 9, రబాడ 4, డస్సెన్ 4, షంసీ 3, బవుమా 2 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5, షకీబ్ 2, హాసన్, ఇస్లాం తలో వికెట్ తీశారు.

సునాయసంగా లక్ష్య చేధన
అనంతరం 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ సునాయసంగా చేధించింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ఇక్బాల్, లిటన్ దాస్ తొలి వికెట్‌కు 127 పరుగుల సెంచరీ భాగస్వామ్మాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 48 పరుగులు చేసిన లిటన్ దాస్ ఔటైనప్పటికీ షకీబుల్ హాసన్ (18*)తో కలిసి తమీమ్ ఇక్బాల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 26.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ విజయాన్ని అందుకోవడం గమనార్హం. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. కాగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు పేసర్ తస్కిన్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.

టీమిండియా వైట్ వాష్
ఈ ఏడాది జనవరిలో ఇదే సౌతాఫ్రికా గడ్డపై 3 వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక వైట్ వాష్ అయింది. మూడింటికి మూడు వన్డేల్లోనూ ఓడి సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. అంతకుముందు జరిగి టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా ఓటమి పాలైంది. టెస్ట్ సిరీస్‌కు 1-2 తేడాతో ఓడింది. దీంతో తాజాగా బంగ్లాదేశ్ విజయాన్ని ఉద్దేశించి ఆ జట్టు ఆటగాళ్లను చూసి టీమిండియా ఆటగాళ్లు బుద్ది తెచ్చుకోవాలని పలువురు చురకలు అంటిస్తున్నారు.


Click it and Unblock the Notifications
