Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా: రబాడ అప్పీలుపై 19న విచారణ

South Africa Vs Australia: Monday hearing for banned Kagiso Rabada

హైదరాబాద్: రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కు గురైన దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసొ రబాడ అప్పీల్‌పై మార్చి 19(సోమవారం)న విచారణ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తెలిపింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో రబాడ దురుసుగా ప్రవర్తించడంతో మ్యాచ్ రిఫరీ అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు.

ఈ నిషేధంపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఐసీసీకి అప్పీలు చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన సీనియర్‌ లాయర్‌ హెరాన్‌ను జ్యూడిషియల్‌ కమిషనర్‌గా ఐసీసీ నియమించింది. ఆయన టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా రబాడ వాదనను వింటారు. ఈ విచారణ ముగిసిన 48 గంటల్లో కమిషనర్‌ తుది నిర్ణయం తీసుకుంటారు.

దీంతో మూడో టెస్టులో రబాడ ఆడేది లేనిది మంగళవారం తెలిసి పోతుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ని నెగ్గాయి. దీంతో ఈ సిరిస్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండో టెస్టులో 11 వికెట్లతో అద్భుతమైన ఫామ్‌లో రబాడపై నిషేధం విధించడం ఆ జట్టుని ఆందోళకు గురి చేస్తోంది.

ఇరు జట్ల మధ్య మూడో టెస్టు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా గురువారం ప్రారంభం కానుంది.

Story first published: Saturday, March 17, 2018, 18:01 [IST]
Other articles published on Mar 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+