
భారత్‌తో వన్డే సిరీస్‌కు అతిథ్య జట్టు సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టును టెంబా బవుమా నడిపించనున్నాడు. కేశవ్ మహరాజ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల జరిగిన టెస్టు క్రికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ పేసర్ మార్కో జాన్సెన్ వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆకస్మాత్తుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ వన్డేలకు అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే, పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. నెదర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన ఐడెన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, కగిసో రబాడ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి 23 మధ్య వన్డే సిరీస్ జరగనుంది. 19న పార్ల్‌లో తొలి వన్డే మ్యాచ్, 21, 23న రెండు, మూడో వన్టేలు కేప్‌టౌన్‌లో జరగనున్నాయి.
సౌతాఫ్రికా జట్టు:
టెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డికాక్, జన్నెమాన్ మలన్, జుబేర్ హంజా, మార్కో జెన్సన్, సిసండా మగాలా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, ఆండైల్ ఫెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, రాసి వాన్ డెర్ డస్సెన్, కైల్ వెర్రెన్.
మరోవైపు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును సెలెక్టర్లు డిసెంబర్ 31నే ప్రకటించారు. కెప్టెన్ రోహిత్‌శర్మ గాయంతో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో 18 మందితో టీమిండియాకు ఓపెనర్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం.
భారత జట్టు:
కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యా కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), యజుర్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషిగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్దు కృష్ణ, షర్దూల్ ఠాకుర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.