
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మొదటి మ్యాచ్‌లో పాల్గొననున్న జట్టు, మ్యాచ్ జరగనున్న ప్రదేశం వివరాలను ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. పదిహేను మందితో కూడిన జట్టుతో మొదటి టెస్ట్ సిరీస్‌ను కేప్‌టౌన్ లోనే ఆడనున్నట్లు తెలిపింది.
వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు కారణంగా కొంతకాలంగా మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ ఫాఫ్ దు ప్లెసిస్ ఆటకు సిద్ధమయ్యాడు. అనారోగ్యం కారణంతో జింబాబ్వే-దక్షిణాఫ్రికా నాలుగు రోజుల డై-నైట్ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.
మొదటి టెస్ట్‌లో ఆడనున్న ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, టెంబా బావుమా, క్వింటన్ డె కాక్(వికెట్ కీపర్), థ్యూనస్ దె బ్య్రూన్, ఏబీ డె విలియర్స్, డియన్ ఎల్గార్, కేశవ్ మహరాజ్, ఐడిన్ మర్కరమ్, మోర్నె మోర్కెల్, క్రిస్ మొర్రిస్, ఆండిలె ఫెలుక్వాయో, వెర్నన్ ఫిలాండర్, కగిసో రబడ, డాలె స్టేన్.
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛటేశ్వర్ పూజారా, అజింక్యా రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.