
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. లంచ్ విరామం వరకు ఒక్క వకెట్ కూడా కోల్పోకుండా ఆడిన దక్షిణాఫ్రికాకు తొలి వికెట్ ను కోల్పోయింది. అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు ఎల్గర్ షాట్ కొట్టాడు. ఆ బంతిని మురళీ విజయ్ క్యాచ్ పట్టడంతో దక్షిణాఫ్రికా మొదటి వికెట్ ను కోల్పోయింది.
తొలి టెస్టు విజయోత్సాహంతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా రెండో టెస్టులోనూ అదే విధంగా రాణిస్తోంది. లంచ్ విరామానికి 76/0 స్కోరుతో దూసుకెళుతుంది.