Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా..టీమిండియా రికార్డు బ్రేక్!

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు కొనసాగిస్తోంది. గ్రూప్-డీలో ఆడిన మూడింట్లో నెగ్గి సూపర్-8 అర్హతకు మరింత చేరువైంది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. మొదట సఫారీ సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్.

జీమ్ హసన్ షకీబ్ (3/18) మూడు, తస్కిన్ అహ్మద్ (2/19) రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్ (37; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. కేశవ్ మహరాజ్ (3/27) మూడు, నోకియా (2/17), రబాడ (2/19) రెండు వికెట్లతో రాణించారు.

South Africa Sets Record for Lowest Target Defended in T20 World Cups After Win Against Bangladesh

అయితే 114 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్న దక్షిణాఫ్రికా పలు రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తక్కువ స్కోరును విజయవంతంగా డిఫెండ్ చేసిన జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక, భారత్ పేరిట సంయుక్తంగా ఉంది. 2014లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో అఫ్గానిస్థాన్ (124 వర్సెస్ వెస్టిండీస్), న్యూజిలాండ్ (127 వర్సెస్ ఇండియా) ఉన్నాయి.

అంతేగాక టీ20 వరల్డ్ కప్‌లో అయిదు కంటే తక్కువ పరుగుల తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. పొట్టి కప్‌లో 2009లో న్యూజిలాండ్‌పై ఒక్క పరుగు, 2014లో మరోసారి న్యూజిలాండ్‌పై రెండు పరుగులు, 2014లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులు, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై నాలుగు పరుగుల తేడాతో సౌతాఫ్రికా నెగ్గింది.

ఇక టీ20ల్లో స్వల్ప స్కోరును డిఫెండ్ చేయడంలో దక్షిణాఫ్రికా‌కు ఇదే అత్యుత్తమం. అంతకుముందు శ్రీలంకపై కాపాడుకున్న 116 పరుగుల లక్ష్యం ఉత్తమంగా ఉండేది. కాగా, పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌పై సఫారీ సేనకు వరుసగా ఇది తొమ్మిదో విజయం. బంగ్లాపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో న్యూజిలాండ్ (10), పాకిస్థాన్ (9), సౌతాఫ్రికా (9), భారత్ (8) ఉన్నాయి.

Story first published: Tuesday, June 11, 2024, 9:36 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+