Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెత్త్త ఆటతో భారత్ చిత్తు: దక్షిణాఫ్రికా విజయహాసం

కటక్: భారత్‌పై రెండో ట్వంటీ20 మ్యాచులో దక్షిణాఫ్రికా సోమవారం రాత్రి ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల సిరీస్ దక్షిణాఫ్రికా సొంతమైంది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. 17.1 ఓవర్లలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 92 పరుగులకే చేతులెత్తేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నింపాదిగా లక్ష్యా్న్ని ఛేదించింది.

భారత్ ఆట తీరుకు తీవ్ర నిరాశకు గురైన అభిమానులు మైదానంలోకి ఖాళీ నీళ్ల బాటిల్స్ విసిరారు. దీంతో రెండు సార్లు ఆటకు అంతరాయం కలిగింది. అభిమానులను శాంతపరిచిన తర్వాత తిరిగి భారత్, దక్షిణాఫ్రికా మధ్య ట్వంటీ20 మ్యాచు తిరిగి ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా గెలుపును అందుకుంది. అంతకు ముందు 76 పరుగుల స్కోరు వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆట రెండో సారి మధ్యలో అగిపోయింది. రెండోసారి ఆట ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. భారత్ తన ముందు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ నింపాదిగా ఆడాపు. 49 పరుగుల స్కోరు వద్ద దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది.

South Afriva celebrates

సోమవారంనాటి ట్వంటీ20 మ్యాచులో దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిపత్యం సాధించారు. భారత్ పూర్తి 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 17.2 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్ప కూలింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ముందు భారత బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోలేక పోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ మూడు వికెట్లు తీశాడు. ఇమ్రాన్ తాహీర్, మోరిస్ రెెండేసి వికెట్లు తీసుకోగా, రబడకు ఒక్క వికెట్ లభించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రన్నవుట్ అయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లు అదరగొట్టారు. వారి ధాటికి భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. 85 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ, సురేష్ రైనాలు 22 చొప్పున పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలించారు.

భారత్ వికెట్లు టపటపా పడ్డాయి. 45 పరుగులకే భారత్ నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 43 పరుగుల వద్ద రోహిత్ శర్మ రన్నవుట్ కాగా, అంబటి రాయుడు రబడ బౌలింగులో డకౌట్ అయ్యాడు.

రెండో ట్వంటీ మ్యాచులో దక్షిణాఫ్రికాపై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ మోర్కెల్ బౌలింగులో 11 పరుగులు మాత్రమే చేసి, 28 పరుగుల స్కోరు వద్ద అవుట్ కాగా, విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి రన్నవుట్ అయ్యాడు.

భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో సోమవారం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాప్ డూ ప్లెసిస్ టాస్ గెలిచి ఫీల్లింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్లలో కూడా ఒక్కటేసి మార్పులు జరిగాయి. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అర్వింద్ స్థానంలో భారత్ తుది జట్టులోకి హర్భజన్ సింగ్ వచ్చాడు.

దక్షిణాఫ్రికా జట్టులో మర్చంట్ డీ లాంగే స్థానంలో ఎల్బీ మోర్కెల్ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాలలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచును దక్షిణాఫ్రికా గెలుచుకున్న విషయం తెలిసిందే.

South Africa send India to bat first again; Harbhajan replaces Aravind

తుది జట్లు

భారత్: ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్

దక్షిణాఫ్రికా: ఫాఫ్ డూ ప్లెసిస్ (కెప్టెన్), హషీం ఆమ్లా, ఎబి డీవిల్లీర్స్ (వికెట్ కీపర్), జెపి డుమినీ, పర్హాన్ బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, కిగిసో రబడ, కైల్ అబోట్, ఇమ్రాన్ తహీర్, ఎల్బీ మోర్కెల్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+