For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ విధంగా గాల్లో లేపి లేపి కొట్టడమైనది..!!

SA vs ENG 2nd ODI: లార్డ్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ ను కట్టడి చేసింది. ఇంకో గేమ్ మిగిలివుండగానే.. మూడు వన్డే మ్యాచ్ ఈ సిరీస్ ను 2-0తో గెలుచుకుంది. మూడో మ్యాచ్.. ఈ నెల 7వ తేదీన సౌతాంప్టన్ లో జరుగుతుంది. ఆ తర్వాత 12వ తేదీ నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. తొలి మ్యాచ్ కు కార్డిఫ్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

లార్డ్స్ లో జరిగిన ఈ రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ కు దిగిన ఇంగ్లాండ్ పోరాడినప్పటికీ- లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయిదు పరుగుల దూరంలో నిలిచిందా జట్టు ప్రస్థానం. 50 ఓవర్లల్లో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా సాధించిన ఈ విజయంలో మాథ్యూ బ్రీట్జ్కే అద్భుతమైన 85 పరుగుల ఇన్నింగ్స్ కీలకం.

South Africa secured their ODI series against England with a 5-run win in the 2nd match at Lord

ఓపెనర్లు ఎయిడెన్ మార్క్ రమ్- 49, రియాన్ రికెల్టన్- 35 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. కేప్టెన్ టెంబా బావుమా నాలుగు పరుగులతో విఫలమైనప్పటికీ- ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు చెలరేగారు. బ్రీట్జ్కే- 85, ట్రిస్టన్ స్టబ్స్- 58, డెవాల్డ్ బ్రేవిస్- 42, కార్బిన్ బోష్క్- 32 పరుగులతో సత్తా చాటారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 330 పరుగుల వద్ద ఆగింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఓపెనర్ జెమీ స్మిత్ డకౌట్ అయ్యాడు. జో రూట్- 61, జాకబ్ బేథెల్- 58, జోస్ బట్లర్- 61, విల్ జాక్స్- 39 పరుగులతో ధాటిగా ఆడారు. చివర్లో జోఫ్రా అర్చర్ 14 బంతుల్లో రెండేసి ఫోర్లు, సిక్సర్లతో 27 పరుగులతో మెరుపులు మెరిపించాడు గానీ విజయానికి అవసరమైన ఆ అయిదు పరుగులు రాబట్టుకోలేకపోయాడు.

ఈ మ్యాచ్ తో మాథ్యూ బ్రీట్జ్కే సరికొత్త చరిత్రను లిఖించాడు. అరంగేట్రం చేసిన తొలి అయిదు వన్డేల్లో కూడా ఫిఫ్టీ కొట్టాడు. 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ మరొకడు లేడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై సెంచరీ బాదాడు. ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై రెండు మ్యాచ్ లల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు.

Story first published: Friday, September 5, 2025, 8:24 [IST]
Other articles published on Sep 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+