దక్షిణాఫ్రికాకు మరో షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ పేసర్!!

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ వెర్నన్ ఫిలాండర్ (34) కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత ఫిలాండర్ రిటైర్ కానున్నాడు. ఈ మేరకు క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్) ఓ ట్వీట్ చేసింది. మరోవైపు ఫిలాండర్ కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు. దీంతో సీనియర్లు దూరమై ఇప్పటికే సంధి దశలో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో దెబ్బ తగిలింది.

టెస్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు:
దక్షిణాఫ్రికా పేస్ విభాగంలో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌తో పాటు ఫిలాండర్ కూడా కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాకు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించిచాడు. ఫిలాండర్ టీ20, వన్డేలు ఆడినా కూడా టెస్టు స్పెషలిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు దక్కింది. ఇటీవల కాలంలో గాయాలు వెంటాడుతుండంతో 34 ఏళ్ల ఫిలాండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

60 టెస్టుల్లో 216 వికెట్లు:
12 ఏళ్ల కెరీర్‌లో ఫిలాండర్ 60 టెస్టుల్లో 22.16 సగటుతో 216 వికెట్లు తీసాడు. ఇందులో 13 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. సఫారీ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫిలాండర్.. ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. గత 18 నెలల్లో ఫిలాండర్ 6 టెస్టులు మాత్రమే ఆడాడు. ఇటీవలే ఫిలాండర్ ఫిట్‌నెస్‌ను మాజీ కెప్టెన్, దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

8 హాఫ్ సెంచరీలు:
ఫిలాండర్ 60 టెస్ట్‌లు, 30 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 216 వికెట్లు, 1619 పరుగులు చేసాడు. 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. నాలుగు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన ఉంది. 30 వన్డేలు ఆడి 41 వికెట్లు, 151 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 30. ఇక 7 టీ20ల్లో 4 వికెట్లతో సహా 14 పరుగులు సాధించాడు. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి ఫిలాండర్‌కు మంచి వీడ్కోలు పలకాలని సఫారీ జట్టు చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications