Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa: సౌతాఫ్రికాకు గట్టి షాక్.. భారత్‌తో చివరి రెండు టెస్ట్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం!

South Africa’s wicketkeeper Quinton De Kock is away for two Test Matches Against India

త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే భార‌త్, సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో ఆయా జ‌ట్ల అభిమానుల‌ను నిరాశ‌కు గురి చేసే వార్తలు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ గాయం కార‌ణంగా సిరీస్ మొత్తానికి దూర‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త జ‌ట్టుకు బిగ్‌షాక్ త‌గిలింద‌నే చెప్పుకోవాలి. ఇదే స‌మ‌యంలో సౌతాఫ్రికా అభిమానుల‌ను కూడా నిరాశ గురి చేసే వార్త వెలువ‌డింది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్‌, వికెట్ కీప‌ర్ క్వింటన్ డికాక్ భార‌త్‌తో జ‌రిగే రెండు, మూడు టెస్టుల‌కు దూరంకానున్నాడని ఆ వార్త స‌మాచారం.

డికాక్ ఆడ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణం

డికాక్ ఆడ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణం

డికాక్ భార్య స‌శా ప్ర‌స్తుతం నిండు గ‌ర్భిణి. ఆమె జ‌న‌వ‌రి ప్రారంభంలో ప్ర‌స‌వించ‌నుంది. దీంతో డికాక్ రెండు, మూడో టెస్ట్ మ్యాచ్‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మొద‌ట మూడో టెస్ట్‌కే దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ, బ‌యోబ‌బుల్‌తోపాటు ఇత‌ర కార‌ణాల‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు కూడా డికాక్ దూరంగా ఉంటున్నాడు. ఈ మేర‌కు ఆ జట్టు సెలెక్షన్‌ కన్వీనర్‌ విక్టర్‌ పిట్సాంగ్‌ వెల్లడించాడు. డికాక్ భార్య స‌శా జ‌న‌వ‌రిలో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని, దీంతో అత‌ను పితృత్వ సెల‌వుల‌పై వెళ్ల‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపాడు. అలాగే డికాక్ గైర్హాజ‌రీలో కైల్ వెర్రిన్ లేదా ర్యాన్ రికెల్టన్‌ వికెట్‌కీపింగ్ బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్న‌ట్టు పిట్సాంగ్ చెప్పాడు.

 డికాక్ టెస్ట్ కెరీర్‌

డికాక్ టెస్ట్ కెరీర్‌

2014లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన క్వింట‌న్ డికాక్‌.. అప్ప‌టినుంచి ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తున్నాడు. ఈ ఏడేళ్ల టెస్ట్ కెరీర్‌లో 53 టెస్ట్ మ్యాచ్‌లాడిన డికాక్ 39 స‌గ‌టుతో 3245 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 22 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక త‌న కీపింగ్ నైపుణ్యంతో ఇప్ప‌టిర‌కు టెస్ట్ క్రికెట్‌లో 226 మందిని ఔట్ చేశాడు. ఇందులో 224 మందిని క్యాచ్ ద్వారా ఔట్ చేయగా.. 11 మందిని స్టంపౌట్ చేశాడు. ఒక‌రిని ర‌నౌట్ చేశాడు.

 భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌

భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌

నిజానికి భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య టెస్ట్ సిరీస్ ఈ నెల 17 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ద‌క్షిణాఫ్రికాలో క‌రోనాలో ఒక వేరియంటైన‌ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌డంతో సిరీస్‌ను 10 రోజులు వాయిదా వేశారు. రీషెడ్యూల్‌ ప్ర‌కారం ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్ట్ ఈ నెల 26 నుంచి సెంచూరియ‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది. దీనికే బాక్సింగ్ డే టెస్ట్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. రెండో టెస్ట్ మ్యాచ్ జోహ‌న్నెస్ బ‌ర్గ్ వేదికగా జ‌న‌వ‌రి 3 నుంచి 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇక చివ‌రిదైన మూడో టెస్ట్ మ్యాచ్ కేప్‌టౌన్ వేదిక‌గా జ‌న‌వ‌రి 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

Story first published: Tuesday, December 14, 2021, 14:56 [IST]
Other articles published on Dec 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+