అదరగొట్టారు: ఆఖరి బంతికి దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం
హైదరాబాద్: మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ సత్తాచాటింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. చివరి ఓవర్‌లో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. భారత్ గెలువాలంటే 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి వచ్చింది.
ప్రత్యర్థి బౌలర్ లెట్‌సోలో తొలి బంతి వేసింది.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో పూనమ్ యాదవ్ రనౌట్.. ఇక విజయానికి 5 బంతుల్లో 8 పరుగులు కావాలి. ఈ దశలో లెట్స్‌సోలో వరుసగా మూడు డాట్ బాల్స్ వేసింది. దీంతో చివరి రెండు బంతుల్లో భారత విజయానికి 8 పరుగులు అవసరం అయ్యాయి.

క్రీజులో భారత తాత్కాలిక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. 50వ ఓవర్ సాగుతున్న తీరు చూస్తే భారత్ ఓటమి దాదాపుగా ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఈ దశలో హర్మన్‌ప్రీత్ (41 బంతుల్లో 41 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్) కౌర్ సంచలనం చేసింది. ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్‌లో భారీ సిక్సర్ బాది ఆశలు రేపింది.
ఇక ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలోనూ ఫుల్‌టాస్‌ను లాంగాన్‌లోకి పంపి వేగంగా డబుల్ పూర్తి చేసింది. మంగళవారం ఉత్కంఠ భరిత ఫైనల్లో భారత జట్టు ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 245 పరుగుల లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు లిజెల్లా లీ 37, లౌరా వొల్వార్త్ త్ 21 పరుగులతో పెవిలియన్‌కు చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ నికేర్క్ 37, సున్ లూస్ 35 పరుగులతో రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
భారత్ బౌలర్లలో గైక్వాడ్ 3 వికెట్లు, శిఖా పాండే 2, బిస్త్, శర్మ, వైద్య తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 245 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఎనిమిదో ఓవర్‌లోనే తిరుష్ కామిని (10) వికెట్ కోల్పోయినప్పటికీ, మోనా మేశ్రమ్ 59, దీప్తి శర్మ 71, రెండో వికెట్‌కు 124 పరుగులు జత చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఈ ఇద్దరు బౌండరీలతో చెలరేగిపోయారు. అయితే ఈ ఇద్దరు 8 బంతుల తేడాలో ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. ఇక 148/3 స్కోరు వద్ద క్రీజ్‌లోకి వచ్చిన వేద కృష్ణమూర్తి (31), హర్మన్‌ప్రీత్ కౌర్ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించిన తర్వాత 41వ ఓవర్‌లో వేద పెవిలియన్‌కు చేరుకుంది.
ఈ దశలో శిఖా పాండే (12) సమయోచితంగా ఆడటంతో భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. కానీ మూడు బంతుల తేడాలో శిఖా, దేవిక వైద్య (0) వెనుదిరిగారు. ఆ తర్వాత సుష్మా వర్మ (0), ఏక్తా బిస్త్ (6) కూడా నిరాశపర్చడంతో భారత్ స్కోరు 45.4 ఓవర్లలో 223/8గా మారింది.
ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేయాల్సివుండగా తొలి బంతికి పూనమ్ యాదవ్ రనౌటైంది. చివరి రెండు బంతుల్లో 8 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ జట్టును గెలిపించింది. మిథాలీ రాజ్ తొడకండరం గాయంతో మ్యాచ్‌కు దూరం కావడంతో సారథ్య బాధ్యతలు అందుకున్న హర్మన్‌ప్రీత్ (41 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది.
సంక్తిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా: 49.4 ఓవర్లలో 244 (లిజెల్లా లీ 37, ప్రీజ్ 40, నికేర్క్ 37, సున్ లూస్ 35*; శిఖా పాండే 2 for 41, రాజేశ్వరి గైక్వాడ్ 3 for 51).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications