Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేయసిని పెళ్లాడిన దక్షిణాఫ్రికా యువ సంచలనం

ఐపీఎల్ వేలంలో భారీ మొత్తాన్ని దక్కించుకుంటాడని గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన దక్షిణాఫ్రికా యువ సంచలనం కొయెట్జీ మరోసారి వార్తల్లొకెక్కాడు. అయితే ఈ సారి తన అద్భుత ప్రదర్శనతో కాదు.. తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నందుకు! యువ పేసర్ కొయెట్జీ ఒక ఇంటివాడయ్యాడు. ఆత్మీయుల సమక్షంలో తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నాడు. గతంలో ఆమెతో పలు ఫొటోలు తన ఇన్ స్టాగ్రామ్ లో అతడు పంచుకున్నాడు. కానీ ఆమె వివరాలు మాత్రం వెల్లడించలేదు. కాగా, పెళ్లి అయిన ఈ కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు కొయెట్జీ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. స్టైయిన్ లా వేగంగా బంతులు సంధించడంతో పాటు కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. 23 ఏళ్ల ఈ స్పీడ్ గన్ వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. మెగాటోర్నీలో ఎనిమిది మ్యాచ్ లే ఆడిన కొయెట్జీ 20 వికెట్లు సాధించాడు. సెమీఫైనల్ ఆఖర్లో ఆస్ట్రేలియా జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఆదిలోనే దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైనా సెమీస్ మ్యాచ్ ఆఖరి వరకు సాగిందంటే అది కొయెట్జీ పోరాటమే.

South Africa player Gerald Coetzee married his girlfriend

వన్డే వరల్డ్ కప్ లో మిడిల్ ఓవర్లలో కొయెట్జీ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ టేకర్ గా నిలిచాడు. దాంతో ఈ నెల 19న దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ వేలంలో అతడికి ఫుల్ డిమాండ్ ఉంటుందని ఇప్పటికే క్రికెట్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. మరి ఫ్రాంచైజీలు అతడిని ఏ ధరకు కొనుగోలు చేస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

మరోవైపు దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టు ఇవాళ బయలుదేరనుంది. సౌతాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. కొయెట్జీని తొలి రెండు టీ20లకు సెలక్ట్ అయ్యాడు. ఆఖరి టీ20తో పాటు వన్డే సిరీస్ కు అతడికి విశ్రాంతి ఇచ్చారు. అనంతరం టెస్టు సిరీస్ కోసం జట్టుతో చేరుతాడు.

Story first published: Tuesday, December 5, 2023, 15:33 [IST]
Other articles published on Dec 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+