Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Southafrica 4th t20: సౌతాఫ్రికాకు గట్టి దెబ్బ, స్టార్ బౌలర్లు దూరం, సేమ్ టీంతో టీమిండియా

South Africa opted to bowl first, two changes for southafrica, no changes in teamindia

దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్లో వరుసగా రెండు ఓటముల తర్వాత వైజాగ్లో టీమిండియా గెలుపు బోణీ చేసింది. మరో విజయంపై కన్నేసింది. శుక్రవారం రాజ్ కోట్‌లో జరిగే నాలుగో మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రిషబ్ పంత్ సేన చూస్తోంది. వైజాగ్ టీ20 విజయం పంత్ సేనకు మంచి ఆత్మవిశ్వాసాన్ని అందించి ఉంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఆ ఆత్మవిశ్వాసాన్ని రాజ్‌కోట్‌లోనూ టీమిండియా కొనసాగిస్తే.. తప్పక గెలవొచ్చు. ఇక్కడ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే నిర్ణయాత్మక చివరి టీ20లో టీమిండియా గెలవడానికి మరిన్ని అవకాశాలుంటాయి. ఇక ఈ సిరీస్‌లో టీమిండియాను బాగా కలవరపెడుతున్న అంశం రిషభ్ పంత్‌ వైఫల్యం. 29, 5, 6 మూడు మ్యాచ్‌ల్లో పంత్ స్కోర్లు ఇవి. కెప్టెన్సీ బాధ్యతల భారం వల్ల ప్లేయర్‌గా ఫెయిల్ అవుతున్నాడనే మచ్చ పడకుండా ఉండడానికి ఈ మ్యాచ్‌లో పంత్ ఓ మంచి నాక్ ఆడాల్సిన అవసరముంది.

ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా మరోసారి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్లో రిషబ్ పంత్ ఒక్కసారి కూడా టాస్ గెలవలేదు. ఇక టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. టాస్ అనంతరం టెంబా బవుమా మాట్లాడుతూ.. 'మేం బౌలింగ్ తీసుకుంటాం. నిజం చెప్పాలంటే ఈ పిచ్‌లో వికెట్ ఎలా ఉందో తెలియదు. మేము బాగా ఛేజింగ్ చేయగలం. ఇక్కడ హైస్కోర్ నమోదవుతుందని తెలుస్తోంది. దాదాపు 180 బెస్ట్ స్కోరు అని నమ్ముతున్నా. ఇక మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయాల కారణంగా రబాడా, పార్నెల్ తప్పుకున్నారు. వారి స్థానంలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సేన్ జట్టులోకి వచ్చారు.' అని బవుమా పేర్కొన్నాడు.

తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w/c), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(సి), క్వింటన్ డి కా

Story first published: Friday, June 17, 2022, 18:52 [IST]
Other articles published on Jun 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+