Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'దక్షిణాఫ్రికా భవిష్యత్తు కోసం క్వింటన్‌ డికాక్‌కు సారథ్యం'

South Africa needs to look at future says Team Director Enoch Nkwe

ధర్మశాల: దక్షిణాఫ్రికా జట్టు భవిష్యత్తు కోసం యువ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌కు పరిమిత ఓవర్ల సారథ్యం అప్పగించాం అని ఆ జట్టు తాత్కాలిక డైరెక్టర్‌ ఎనోచ్‌ తెలిపాడు. త్వరలో టీమిండియాతో జరిగే సిరీస్ కోసం కెప్టెన్ డుప్లెసిస్‌ను జట్టు నుంచి తప్పించి దక్షిణాఫ్రికా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో సారథ్య భాద్యతలు డికాక్‌కు అప్పగించింది. ఈ టోర్నీని డికాక్‌ విజయవంతంగా ముగిస్తే అతనికే సారథ్యం వరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌లో డుప్లెసిస్‌ తన జూనియర్ డికాక్‌ సారథ్యంలో ఆడనున్నాడు.

ఎనోచ్‌ మాట్లాడుతూ... 'ఒక ఆటగాడిగా, సారథిగా జట్టుకు డుప్లెసిస్‌ ఎంతో సేవ చేశాడు. డుప్లెసిస్‌ స్థానం ఏంటో మాకు తెలుసు. కానీ మేం భవిష్యత్తుపై దృష్టి సారించాలి. జట్టు భవిష్యత్తు దృష్ట్యా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా డికాక్‌ను ఎంపిక చేశాం. అతనిపై నమ్మకం, విశ్వాసం ఉంది. భవిష్యత్తును నిర్మించుకొనేందుకు మాకిదో మాకు ఇది మంచి అవకాశం. ప్రస్తుతం మా దృష్టంతా టీమిండియా సిరీస్‌పైనే ఉంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు పటిస్ఠ పునాది వేసుకోవాలని మేం కోరుకుంటున్నాం' అని పేర్కొన్నాడు.

'మా ఆటగాళ్లలో చాలా మందికి భారత్‌లో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్ కూడా ఆడారు. డికాక్‌ ఇక్కడ ఎక్కువ క్రికెట్‌ ఆడాడు. జట్టు యువకులతో ఉంది. అయినా గట్టిపోటీ ఇస్తాం. ఈ సిరీస్‌ గెలవాలనుకుంటున్నాం. టీమిండియా పటిష్ఠమైన జట్టు. మేం 100 శాతం విజయం కోసం కృషి చేస్తాం. టీ20 మెగాటోర్నీ వరకు దక్షిణాఫ్రికాకు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. భారత పర్యటన తర్వాత మా ప్రదర్శనపై ఓ అవగాహన వస్తుంది. అప్పుడు మా ఆటపై మళ్లీ సమీక్షించుకుంటాం. ఈ సిరీస్ అనంతరం ఇంగ్లాండ్‌ సిరీస్‌కు సన్నద్ధం అవుతాం' అని ఎనోచ్‌ తెలిపాడు.

Story first published: Wednesday, September 11, 2019, 15:36 [IST]
Other articles published on Sep 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+