పరుగుల సునామీ ముందు - వర్షం కూడా వెలవెల: టీ20 ప్రపంచకప్‌లో తొలి మెరుపు సెంచరీ

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022లో దక్షిణాఫ్రికా దుమ్ము దులుపుతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్టేడియంలో పరుగుల సునామీ సృష్టిస్తోన్నారు. దీని ముందు వర్షం కూడా వెలవెలబోయినట్టయింది. వర్షం పడే అవకాశం ఉండటం వల్ల వీలైనంత వేగంగా పరుగుల వరద పారించాలని ముందే స్కెచ్ వేసుకున్నట్టుగా కనిపించారు ప్రొటీస్ బ్యాటర్లు. దీనికి అనుగుణంగా మెరుపువేగంతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు.
205 పరుగుల భారీ టార్గెట్..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది ప్రొటీస్ టీమ్. కేప్టెన్ కమ్ ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతే- మరో వికెట్ కోసం బంగ్లాదేశ్ బౌలర్లు తలకిందులుగా తపస్సు చేయాల్సి వచ్చింది.
కదం తొక్కిన రొస్సొ
170 పరుగుల వద్ద రెండో వికెట్ పడిందంటే- దక్షిణాఫ్రికన్లు పట్టిన పట్టు ఏ స్థాయిలో బిగుసుకుందో అర్థం చేసుకోవచ్చు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిలీ రొస్సొ భారీ షాట్లతో చెలరేగిపోయారు. సునామీలా విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి- రొస్సొ పగబట్టినట్టు ఆడాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో 100 పరుగులు చేశాడీ టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇందులో ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి.
109 పరుగులు..
ఆ తరువాత కూడా అతని విజృంభణ కొనసాగింది. సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. 109 పరుగులు చేసిన రొస్సొ షకీబుల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 170 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 63 పరుగులు చేసిన డికాక్ మూడు సిక్సర్లు ఏడు ఫోర్లు బాదాడు. హఫీఫ్ హొస్సైన్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు.
చివర్లో తగ్గిన జోరు..
ఆ తరువాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. షకీబుల్ హసన్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన షాట్‌ను లిట్టన్ దాస్ అందుకున్నాడు. ఎయిడెన్ మార్క్‌రమ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ సంధించిన చివరి ఓవర్‌లో అతను పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి సౌమ్యా సర్కార్ చేతికి చిక్కాడు.
వెంటవెంటనే వికెట్లు..
205 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఇన్నింగ్ ముగిసింది. ఒకదశలో దక్షిణాఫ్రికా మరింత భారీ స్కోర్ చేస్తుందనిపించినప్పటికీ చివరలో వెంటవెంటనే వికెట్లను కోల్పోవాల్సి రావడంతో జోరు తగ్గింది. బంగ్లా బౌలర్లల్లో షకీబుల్ హసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఆఫీఫ్ హొస్సైన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications