Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUSvsSA: ఏమైందో అర్థం కాలేదు.. రెండ్రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచ్!

South Africa looses despite Kagiso Rabada heroic spell

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు అనూహ్య మలుపులు తిరిగింది. అయితే చివరకు విజయం మాత్రం ఆసీస్‌నే వరించింది. కేవలం రెండ్రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తేలిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారు.

రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణం..

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు కూడా మంచి ఆరంభం లభించలేదు. కగిసో రబాడ, మార్కో జాన్సెన్ ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశారు. అయితే స్టీవ్ స్మిత్ (36), అలెక్స్ కేరీ (22 నాటౌట్)తోపాటు ట్రావిస్ హెడ్ (92) రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 218 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్సులో కూడా సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. టెంబా బవుమా (29), ఖాయా జోండో (36 నాటౌట్), కేశవ్ మహరాజ్ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. దీంతో సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా 99 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.

అదరగొట్టిన రబాడ.. కానీ..

సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంతో ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం లేకుండా పోయింది. అయితే మరోసారి సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగారు. కానీ వికెట్ల వేటలో లైన్ అండ్ లెంగ్త్ తప్పారు. కానీ కగిసో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఉస్మాన్ ఖవాజా (2), డేవిడ్ వార్నర్ (3), మార్నస్ లబుషేన్ (5 నాటౌట్), స్టీవెన్ స్మిత్ (6), ట్రావిస్ హెడ్ (0) పరుగులు మాత్రమే చేశారు. ఈ నాలుగు వికెట్లను రబాడనే కూల్చడం విశేషం. అయితే ఈ వికెట్ల వేటలో లైన్ అండ్ లెంగ్త్ తప్పిన సఫారీ బౌలర్లు 19 ఎక్స్‌ట్రా పరుగులు సమర్పించుకోవడంతో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ నెగ్గింది.

ఏమైందో అర్థం కావడం లేదు..

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గార్.. ఇప్పటికీ తనకు మ్యాచ్‌లో ఏమైందో తెలియడం లేదన్నాడు. ఇంకో 60 పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, బ్యాటింగ్ విభాగం మరింత పట్టుదల ప్రదర్శించి ఉండాల్సిందని అన్నాడు. మ్యాచ్ గెలిచిన ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్నారని చెప్పాడు. వాళ్ల వల్లే తాము పైచేయి సాధించామని అభిప్రాయపడ్డాడు. రెండ్రోజుల్లోనే ఆట ముగియడం వల్ల తమకు మరింత సమయం దొరుకుతుందని, బాక్సింగ్ డే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, December 18, 2022, 17:59 [IST]
Other articles published on Dec 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+