వీరాట్ రూపం వృధా, వర్షం కారణంగా దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి

మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను భారత బౌలర్లు తిప్పలు పెట్టారు. జహీర్, మునాఫ్ బౌలింగ్‌లో పరుగులు సాధించేందుకు ఓపెనర్ స్మిత్ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఆమ్లా మాత్రం కుదురుకున్నాక.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆమ్లా తర్వాత ఎవరినీ లెక్కచేయలేదు. మునాఫ్ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. జహీర్, నెహ్రాల బౌలింగ్‌లోనూ స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. ప్యాడ్‌లపైకి బంతులు విసురుతూ ఆమ్లాను కట్టడి చేయలనుకున్న భజ్జీ వ్యూహాలు పారలేదు. మరోవైపు తడబడుతూనే చాలాసేపు క్రీజులో నిలిచిన స్మిత్ (18) నెహ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడు భజ్జీకి క్యాచ్ ఇచ్చాడు. మూడేళ్ల తర్వాత వన్డే ఆడుతున్న వాన్‌విక్ (15) పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ సింగిల్స్‌తో స్త్ట్రెక్ రొటేట్ చేస్తూ ఆమ్లాకు సహకరించాడు. వ్యక్తిగత స్కోరు 38 పరుగుల వద్ద ఆమ్లా వన్డేల్లో రెండు వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అత్యంత వేగంగా (41 వన్డేల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడు ఆమ్లానే. జహీర్ అబ్బాస్ (45 మ్యాచ్‌లు) పేరిట ఉన్న 28 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. యువీ బౌలింగ్‌లో బౌండరీతో ఆమ్లా ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అతడు జోరు కొనసాగించడంతో 19వ ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది.
19 ఓవర్లలో 105/1తో భారీ స్కోరు చేసేలా కనిపించిన దక్షిణాఫ్రికా వరుసగా నాలుగు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 20వ ఓవర్లో వాన్‌విక్‌ను యువీ ఔట్ చేస్తే.. తర్వాతి ఓవర్లో ఆమ్లా పెవిలియన్ చేరాడు. రోహిత్ బౌలింగ్‌లో లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. డివిలియర్స్ (3) యువీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇవ్వగాప్లెసిస్ (1) కూడా రనౌటయ్యాడు. 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను పార్ట్‌టైం బౌలర్లు మరింత పరీక్షించారు. కష్టాల్లో ఉన్న జట్లును డుమిని ఆదుకున్నాడు. వెంటనే వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరుబోర్డును కదిలించాడు. అతడికి బోథా (44; 59 బంతుల్లో 3X4) అండగా నిలబడ్డాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications