For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా క్వింటన్ డీకాక్: భారత పర్యటనకు రానున్న సఫారీ జట్టిదే!

South Africa include three new names in Test squad for India tour; Quinton de Kock to lead T20I side

హైదరాబాద్: సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం భారత పర్యటనకు వచ్చే టెస్టు, టీ20 జట్లను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. భారత్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు సఫారీ సెలక్టర్లు ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు.

పేసర్ అన్రిచ్ నొర్ట్‌జే, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సేనురాన్ ముత్తుసామి, వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ రూడీ సెకండ్స్‌‌లు భారత పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేయనున్నారు. టెస్టుల్లో సఫారీ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా... వైస్ కెప్టెన్‌గా టెంబా బావుమాను బోర్డు ఎంపిక చేసింది.

మరోవైపు టీ20 సిరిస్‌కు సైతం మరో ముగ్గురు కొత్త ఆటగాళ్లను సఫారీ బోర్డు ఎంపిక చేసింది. టెంబా బావుమా జోర్న్ ఫోర్టుయిన్‌లతో పాటు అన్రిచ్ నొర్ట్‌జేలు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు. ఈ టీ20 సిరిస్‌లో దక్షిణాఫ్రికాకు క్వింటన్ డీ కాక్ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు.

అయిడెన్ మర్క్రమ్, తుయినిస్ డె బ్రుయన్, లుంగి ఎంగిడిలను టీ20 సిరిస్‌కు సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియా-ఏతో నాలుగు రోజులు వార్మప్ మ్యాచ్‌ ఆడనుంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టుల్లో తలపడనుంది.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనున్న రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తుండగా... అక్టోబర్ 19 నుంచి 23 వరకు జరిగే మూడో టెస్టుకు పూణె ఆతిథ్యమివ్వనుంది.

అయితే రెండు, మూడు టెస్టు మ్యాచ్‌లు జరగాల్సిన వేదికలను ఇప్పుడు బోర్డు మార్చేసింది. ఈ మార్పుకు సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ కూడా అంగీకరించింది. రెండో టెస్టుకు రాంచీ అతిథ్యమిస్తోన్న సమయంలోనే దూర్గా పూజ ఫెస్టివల్ రావడంతో జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ టెస్టుని పుణెకు మార్పాలంటూ బోర్డును కోరింది.

జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కోరికను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఈ మార్పుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇక, మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనుంది.


భారత పర్యటనకు జట్లను ప్రకటించిన దక్షిణాఫ్రికా బోర్డు:

టెస్టు జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), టెంబా బావుమా (వైస్ కెప్టెన్), థియునిస్ డి బ్రూయిన్, క్వింటన్ డి కాక్ (wk), డీన్ ఎల్గార్, జుబైర్ హమ్జా, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రామ్, సెనురాన్ ముతుసామి, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, వెర్నాన్ ఫిలాండర్, డేన్ పీడ్ట్, కగిసో రబాడా, రూడీ సెకండ్.

టీ20 జట్టు:
క్వింటన్ డి కాక్ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (వైస్ కెప్టెన్), టెంబా బావుమా, జూనియర్ దాలా, జోర్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, అన్రిచ్ నార్ట్జే, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రాబాడా, తబ్రా జోన్-జోన్ స్మట్స్.

Story first published: Tuesday, August 13, 2019, 19:51 [IST]
Other articles published on Aug 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+