Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్, టీమిండియా ప్లేయింగ్ 11? భారత

South Africa have won the toss and have opted to field

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవ్వాళ అయిదు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ప్రారంభమైంది. సిరీస్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమీ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. అలాగే సిరీస్ ఆరంభానికి ముందే కేప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గాయం వల్ల జట్టుకు దూరం అయ్యారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు బదులుగా రిషబ్ పంత్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. వీరిద్దరి నేతృత్వంలోనే టీమిండియా.. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఇక తొలి మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు రిషబ్ పంత్, టెంబా బవుమా గ్రౌండ్లోకి టాస్ కోసం వచ్చారు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.

తుది జట్లు
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్ ), టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే

టీమిండియా (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్

Story first published: Thursday, June 9, 2022, 18:55 [IST]
Other articles published on Jun 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+