తొలి సారి గెలిచినా.. సఫారీ జట్టుకు జరిమానా విధించిన ఐసీసీ

హైదరాబాద్: జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ వేదికగా భారత్‌తో ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేల తర్వాత గెలిచింది. ఈ ఆనంద సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఐసీసీ నుంచి ఓ చేదు వార్త ఎదురైంది.
మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా సఫారీ జట్టుకు జరిమానా విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. సఫారీ కెప్టెన్ మర్‌క్రామ్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించగా, ఆటగాళ్లకు 10 శాతం చొప్పన జరిమానా విధించారు.
ఒకవేళ వచ్చే 12 నెలల్లో మర్‌క్రామ్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సమయంలోనే మరొకసారి స్లో ఓవర్ రేట్‌కు నమోదైతే అతనిపై మ్యాచ్ నిషేధం పడనుంది. నిన్నటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) గెలిచిన సంగతి తెలిసిందే.
నాల్గో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 289 పరుగులు చేసింది. అయితే పదే పదే వర్షం కురవడం వల్ల సఫారీల లక్ష్యం 28 ఓవర్లలో 202కు మారడం ఆ జట్టుకు వరమైంది. చేతిలో వికెట్లు ఉండటంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ టీ 20 తరహాలో ఆడి జట్టును 25.3 ఓవరల్లో 207 పరుగులు చేసి గెలిపించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications