Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 World Cup : వీళ్ల తలరాత మారదా?.. చివరి బంతికి 21 పరుగులు చెయ్యాల్సిన పరిస్థితి!

South Africa fails to shine as Australia bags sixth T20 World Cup

స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్యంగా ఫైనల్ చేరిన సౌతాఫ్రికా అమ్మాయిలు.. అసలు మ్యాచ్‌లో తేలిపోయారు. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన వాళ్లంతా ఒత్తిడికి తలొగ్గి, చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు అనుకున్నంత భారీ స్కోరు చెయ్యలేకపోయారు. కానీ ఛేజింగ్‌లో సఫారీలకు మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆరో టీ20 వరల్డ్ కప్‌ను ఆసీస్ అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకున్నారు.

మూనీ మాస్టర్ క్లాస్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బెత్ మూనీ (74 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఫైనల్స్ అంటే చాలు మరో స్థాయి ప్లేయర్‌గా మారే మూనీ.. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగింది. కానీ మరో ఓపెనర్ అలీసా హేలీ (18) అంత దూకుడుగా ఆడలేకపోయింది. ఆష్లే గార్డనర్ (29) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. తర్వాత వచ్చిన గ్రేస్ హారిస్ (10), మెగ్ లానింగ్ (10), ఎలీస్ పెర్రీ (7), జార్జియా వేర్‌హామ్ (0), తహీలా మెక్‌గ్రాత్ (1 నాటౌట్) పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.

వాళ్లిద్దరూ గెలిపించే వారే!

లక్ష్య ఛేదనలో సఫారీ ఓపెనర్ లారా వోల్వార్ట్ (61) అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించింది. కానీ మిగతా బ్యాటర్ల నుంచి ఆమెకు ఆశించిన సహకారం లభించలేదు. తజ్మిన్ బ్రిట్స్ (17 బంతుల్లో 10), మరిజానే కాప్ (11), సూనే లూస్ (2) అతి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. క్లో ట్రయాన్ (25) కాసేపు ఫర్వాలేదనిపించింది. క్లో, లారా కలిస్తే సఫారీలు గెలిచే వాళ్లే. కానీ క్లోను క్లీన్ బౌల్డ్ చేసిన జోనాసెన్ ఆసీస్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఛేజింగ్ 17వ ఓవర్లో లారా అవుటవడంతో క్లో పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఆమె అవుటైంది.

ఆరో టీ20 వరల్డ్ కప్..

ఆ తర్వాత నడైన్ డి క్లర్క్ (10 బంతుల్లో 8 నాటౌట్), సినాలో జఫ్తా (6 బంతుల్లో 9 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో చివరి బంతికి 21 పరుగులు చేస్తే సఫారీలు గెలిచే స్థితికి చేరుకున్నారు. ఆ బంతిసి కేవలం సింగిల్ రావడంతో ఆస్ట్రేలియా జట్టు సంబరాలు చేసుకుంది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సఫారీ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్.. ఆరో టీ20 వరల్డ్ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

Story first published: Sunday, February 26, 2023, 22:02 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+