Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Points table: లంకను గెలిచి ఆస్ట్రేలియాను దాటిన దక్షిణాఫ్రికా!

డర్బన్ వేదికగా శ్రీలంతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 516 పరుగుల కొండంత లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 103/5తో నాలుగో రోజు ఆట ఆరంభించిన శ్రీలంక 282 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (83; 174 బంతుల్లో, 12 ఫోర్లు), దనంజయ డిసిల్వా (59; 81 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (48; 77 బంతుల్లో, 9 ఫోర్లు) పోరాడారు. మార్కో జేన్సన్ నాలుగు వికెట్లు, రబాడ, కొయెట్జీ, మహరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.

మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా (70; 117 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌటైంది. గత 100 ఏళ్లలో ఒక జట్టు ఇంత తక్కువ బంతుల్లో ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. అలాగే టెస్టుల్లో శ్రీలంక ఇదే అత్యల్ప స్కోరు. కామిందు మెండిస్ (13), లాహిరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మార్కో జేన్సన్ ఏడు వికెట్లతో విజృంభించాడు. కొయెట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ తీశారు.

South Africa Crush Sri Lanka by 233 Runs in 1st Test Climb to Second in WTC Standings

149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 366/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (122; 221 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బవుమా (113; 228 బంతుల్లో, 9 ఫోర్లు) సెంచరీలు సాధించారు. విశ్వా ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో ఆస్ట్రేలియా (57.69 %)ను వెనక్కినెట్టి దక్షిణాఫ్రికా (59.26 %) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ (61.11 %) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్ (54.55 %) నాలుగో స్థానంలో ఉంది.

Story first published: Saturday, November 30, 2024, 20:16 [IST]
Other articles published on Nov 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+