Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెంబా బావుమాపై కత్తి నూరుతున్న దక్షిణాఫ్రికా - కొత్త కేప్టెన్‌గా..!!

South Africa Cricket Board likely will sack Temba Bavuma as skipper.

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 సంచలనాలతో ముగిసింది. చిన్నజట్లు చెలరేగాయి. గ్రూప్స్ దశ నుంచే ప్రధాన జట్లను మట్టి కరిపిస్తూ వచ్చాయి. గ్రూప్స్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రీలంకను ఓడించింది నమీబియా. అక్కడ మొదలైన వాటి ప్రస్థానం- సూపర్ 12 ముగింపు రోజు వరకూ కొనసాగింది. నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసే స్థాయికి చేరుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లల్లో ఒకటైన దక్షిణాఫ్రికా- సెమీ ఫైనల్స్ ముంగిట్లో మునకలేయాల్సి వచ్చింది.

నెదర్లాండ్స్ ధాటికి..

నెదర్లాండ్స్ ధాటికి..

సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకున్న దక్షిణాఫ్రికా చివరికి టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. నెదర్లాండ్స్‌తో ఓటమితో సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుందా టీమ్. సూపర్ 12 దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిపోయింది. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా తలవంచక తప్పలేదు.

 బావుమాపై వేటు..

బావుమాపై వేటు..

ఈ పరిణామాలు- దక్షిణాఫ్రికా జట్టులో కొన్ని కీలక మార్పులకు నాంది పలికడానికి దారి తీసినట్టే కనిపిస్తోంది. కేప్టెన్ టెంబా బావుమవుమాపై వేటు పడే అవకాశాలు లేకపోలేదు. జట్టు స్వదేశానికి చేరుకున్న వెంటనే దీనిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని తెలుస్తోంది. జట్టులో నుంచి ఉద్వాసన పలకకుండా కేప్టెన్‌గా మాత్రమే తొలగించి- జట్టులో సభ్యుడిగా కొనసాగిస్తుందంటూ వార్తలొస్తోన్నాయి.

 మిల్లర్ లేదా..

మిల్లర్ లేదా..

జట్టు సారథిగా.. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ లేదా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పేరును పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. డేవిడ్ మిల్లర్‌కు జట్టు పగ్గాలను అప్పగించడానికి మెజారిటీ క్రికెట్ బోర్డు సభ్యులు, సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్లు స్పోర్ట్స్ వెబ్‌సైట్స్ అభిప్రాయపడుతున్నాయి. మిడిలార్డర్‌లో రాణిస్తోన్న డేవిడ్ మిల్లర్‌కు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడం ద్వారా అతనిపై అదనపు భారం పడుతుందని, అది అతని బ్యాటింగ్‌ను ప్రభావితం చేయగలదనే వాదనలు కూడా లేకపోలేదు.

వ్యక్తిగత ప్రదర్శన కూడా..

వ్యక్తిగత ప్రదర్శన కూడా..

టెంబా బావుమా కేప్టెన్సీలో దక్షిణాఫ్రికా ఇదివరకు పలు మ్యాచ్‌లను ఆడటం ఒక ఎత్తయితే.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి చవి చూడటాన్ని మరో ఎత్తుగా భావిస్తోంది బోర్డ్. వ్యక్తిగతంగా కూడా అతను భారీగా పరుగులు చేయలేకపోవడాన్నీ పరిగణనలోకి తీసుకుంటోంది. 32 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన బావుమా- 635 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 116.08. ఇది ఇతర బ్యాటర్లతో పోల్చుకుంటే లోయెస్ట్ స్ట్రైక్ రేట్. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో 70 పరుగులు మాత్రమే చేశాడు.

Story first published: Monday, November 7, 2022, 8:44 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+