Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్-19 వరల్డ్ కప్: ఐదో స్థానంతో సరిపెట్టుకున్న దక్షిణాఫ్రికా

South Africa claim fifth place at U19 World Cup

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో దక్షిణాఫ్రికా ఐదో స్థానం దక్కించుకుంది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 41.4 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌటైంది.

బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో అఫిఫ్ హొస్సేన్ (63), వికెట్‌కీపర్ షకీల్ హొస్సేన్ (61) హాఫ్ సెంచరీలతో రాణించినప్పటికీ, జట్టులోని మిగతా సభ్యులు రెండంకెల స్కోరు నమోదు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ప్రత్యర్ధి జట్టు ముందు బంగ్లాదేశ్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫ్రేజర్ జోన్స్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఈ మ్యాచ్‌లో జోన్స్ 52 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. మరో బౌలర్ అఖోనా మకా 27 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సఫారీ ఓపెనర్లు మాథ్యూ బ్రెడ్‌లిజ్ 36, జీవేష్ పిళ్లై 12 పరుగులకే ఔటై నిరాశపరిచారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రేనార్డ్ వాన్ టోన్డర్ (82), హెర్మన్ రోల్ఫెస్ (44) రాణించడంతో మరో వికెట్ పడకుండానే దక్షిణాఫ్రికాకు అలవోక విజయాన్ని అందించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 11:00 [IST]
Other articles published on Feb 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+