న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: మళ్లీ తడబడ్డం.. ఓటమిపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా..

 South Africa captain Temba Bawuma said that he did not play properly in the match against the Netherlands

ఆదివారం అడిలైడ్ ఓవల్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా అనూహ్య ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీనిపై సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు. తమ జట్టు మళ్లీ తడబడిందన్నాడు. "చాలా నిరాశపరిచింది. ఈ గేమ్‌కు ముందు మేం బాగా ఆడాం. ఇది తప్పక గెలవాల్సిన గేమ్ అని మాకు తెలుసు. మేము తడబడ్డాము. నాకౌట్‌కు చేరుకుంటామన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం మాకు ఉండే' అని మ్యాచ్ అనంతరం బావుమా చెప్పాడు.

ప్రపంచ కప్‌లో స్థానం కోసమే
"కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. బాగా ఆడాల్సి ఉండే " అని అన్నారు. తదుపరి టి 20 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలనే లక్ష్యాన్ని సాధించామని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు." ఇది మరో గొప్ప అనుభవం, నెదర్లాండ్స్ కు మరొక పెద్ద గెలుపు. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత మాకు పూర్తి లక్ష్యం, తదుపరి ప్రపంచ కప్‌లో స్థానం కోసమే.. అది మేము సాధించామని" అన్నారు.

అకెర్మాన్
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.మహారాజ్ 2 వికెట్లు తీయగా.. నట్రోజ్, మక్రమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మైబర్గ్ 37, మ్యాక్స డౌడ్ 29, టామ్ కూపర్ 35, అకెర్మాన్ 41 పరుగులు చేశాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 145 పరుగులు చేసింది. రూసో 25 పరుగులతో టాప్ స్కోర్ గా నిలిచాడు. క్లెసన్ 21, డికాక్ 20 పరుగులు చేశారు.

Story first published: Sunday, November 6, 2022, 13:05 [IST]
Other articles published on Nov 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X