Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీ టెస్టులో డుప్లెసిస్ కీలక నిర్ణయం: తనకు బదులు వేరొకరిని!

South Africa captain Faf du Plessis may send teammate at toss in Ranchi Test

హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో శనివారం ప్రారంభం కానున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ వేసేందుకు తనకు బదులు జట్టులోని సహచర ఆటగాడిని పంపేందుకు సిద్ధమయ్యాడు. మూడు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో డుప్లెసిస్ టాస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 500కు పైగా పరుగులు చేసిన టీమిండియా.... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 600కుపైగా పరుగులు చేసి పర్యాటక జట్టుని ఫాలో ఆన్ ఆడించింది.

వరుసగా తొమ్మిది సార్లు

వరుసగా తొమ్మిది సార్లు

ఉపఖండంలో డుప్లెసిస్ వరుసగా తొమ్మిది సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి రాంచీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో టాస్ సమయంలో తన స్థానంలో వేరొకరిని పంపించాలని డుప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు మూడో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో డుప్లెసిస్ మాట్లాడాడు.

నా స్థానంలో వేరొకరిని

నా స్థానంలో వేరొకరిని

"రేపటి టాస్‌కు నా స్థానంలో వేరొకరిని పంపుతాను. ఎందుకంటే నా రికార్డ్ ఇప్పటివరకు గొప్పగా లేదు. అవును, మొదటి ఇన్నింగ్స్‌లో స్కోరు బోర్డుపై భారీ పరుగులు చేయాలి. ఆ విధంగా మేము ప్రారంభించాలి" అని డుప్లెసిస్ తెలిపాడు. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు సఫారీలు ఆడిన రెండు తొలి ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచారు.

తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకే

తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకే

విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకే పరిమితమైన దక్షిణాఫ్రికా... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే కుప్పకూలింది. మరోవైపు విశాఖ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 502 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

రాంచీ వేదికగా మూడో టెస్టు

రాంచీ వేదికగా మూడో టెస్టు

ఇక, పూణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 601/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మిలిలుండగానే సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. పూణె టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరిస్‌లను నెగ్గిన ఏకైక జట్టుగా కోహ్లీసేన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా... పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Friday, October 18, 2019, 14:17 [IST]
Other articles published on Oct 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+