ఫీల్డ్‌లోనే బౌలర్ మ్యాజిక్.. వీడియో చూస్తే షాకే!!

పారీ: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు రకరకాల హావభావాలతో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇటీవలి కాలంలో బౌలర్లు కాస్త బిన్నంగా సెలబ్రేషన్స్ చేసుకుని వార్తల్లో నిలిచారు. ఇమ్రాన్ తాహిర్, షెల్డన్ కాట్రెల్‌లు వికెట్ తీసిన తర్వాత ఎంతలా సందడి చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయితే దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షాంసీ మరోఅడుగు ముందుకేసి ఏకంగా ఫీల్డ్‌లోనే మ్యాజిక్ చేసాడు.

ఫీల్డ్‌లోనే మ్యాజిక్:
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మ్జాన్సీ సూపర్ లీగ్‌లో షాంసీ సెలబ్రేషన్స్‌లో భాగంగా తనలోని మరో ప్రతిభను ప్రదర్శించాడు. పారీ రాక్స్ తరఫున ఆడుతున్న షాంసీ.. డర్బన్ హీట్‌తో బుధవారం జరిగిన టీ20లో డేవిడ్ మిల్లర్ వికెట్ తీశాడు. ఈ సందర్భంగా షాంసీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఎడమ చేతిలో ఉన్న వస్త్రంను స్టిక్‌గా మార్చాడు. ఇది చూసినవారంతా ఒక్కారిగా ఆశ్చర్యపోయారు.

గతంలో కూడా మ్యాజిక్:
ప్రస్తుతం ఈ మ్యాజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే షాంసీ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలానే చేశాడు. నవంబర్ నెలలో ఈ లీగ్‌లో జోజి స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం షాంసీ ఇదే తరహా మ్యాజిక్ చేసాడు.

ఫోన్ కాల్ సెలబ్రేషన్స్:
భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో కూడా షాంసీ విన్నూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్‌ను తీసిన తర్వాత షాంసీ తన కాలి షూను తీసి చెవి దగ్గర పెట్టుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అది అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు మ్యాజిక్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు.
డర్బన్ హీట్ విజయం:
ఈ మ్యాచ్‌లో డర్బన్ హీట్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పారీ జట్టు 195 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ హీట్ 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ (97 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (40)లు విజయంలో కీలక పాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications