
జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్ ఒలివర్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. రెండో టెస్టులో భారత ఇన్నింగ్స్‌లో 24వ ఓవర్‌లో అజింక్య రహానేను ఔట్ చేయడం ద్వారా ఒలివర్ ఈ రికార్డు అందుకున్నాడు. ఆ ఓవర్‌లో ఒలివర్ వరుస బంతుల్లో చటేశ్వర్ పుజారాను, అజింక్య రహానేను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు. ఒలివర్ మొత్తంగా 50 వికెట్లు పడగొట్టడానికి 1486 బంతులను తీసుకున్నాడు. అంతేకాకుండా శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఔట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఒలివర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన వెర్నాన్ ఫిలాండర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఫిలాండర్ 1240 బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టడం విశేషం. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలయాకు చెందిన బ్రెట్‌లీ మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెట్‌లీ 1844 బంతుల్లో 50 వికెట్లు తీశాడు. నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జెమీసన్ ఉన్నాడు. జెమీసన్ 1865 బంతుల్లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ఐదో స్థానంలో ఫ్రాంక్ టైసన్ ఉన్నాడు. టైసన్ 1880 బంతుల్లో 50 వికెట్లు తీశాడు. ఇక ఆరో స్థానంలో షేన్ బాండ్ ఉన్నాడు. షేన్ బాండ్ 1943 బంతుల్లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో 202 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివరలో 46 పరుగులు చేసి అశ్విన్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ అగర్వాల్ 26, హనుమ విహారి 20, పంత్ 17, బుమ్రా14 పరుగులు చేశారు. పుజారా, రహానే ఎప్పటిలాగే తమ వైఫల్యాలను కొనసాగించారు. పుజారా 3 పరుగులు చేయగా.. రహానే డకౌట్ అయ్యాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా, ఒలివర్, రబాడ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 35 పరుగులు చేశాడు. క్రీజులో ఎల్గర్ 11, పీటర్సన్ 14 ఉన్నారు. 7 పరుగులు చేసిన మాక్రమ్‌ను షమీ ఔట్ చేశాడు.