స్టెయిన్ అత్యుత్తమ జట్టు.. ఒక్క భారత ఆటగాడికి దక్కని చోటు!!

హైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తారనుకోండి. తాజాగా దక్షిణాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ తాను ఎదుర్కొన్న ఆటగాళ్లు, తనతో కలిసి ఆడిన 11 మంది అత్యుత్తమ ఆటగాళ్లను ప్రకటించాడు.

ఓపెనర్‌గా సంగక్కర
36 ఏళ్ల డేల్ స్టెయిన్ అత్యుత్తమ జట్టులో ఇద్దరు విదేశీయులు తప్ప మిగతావారంతా దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన వారే కావడం గమనార్హం. స్టెయిన్ జట్టులో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు లేకపోవడం విశేషం. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, శ్రీలంక మాజీ వికెట్‌కీపర్ కుమార సంగక్కరలను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. డేవ్ హాకిన్‌కు కీలకమైన మూడో స్థానం ఇచ్చాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ నాలుగో స్థానంలో ఎంచుకున్నాడు.

బ్రెట్ లీ ఒక్కడే
వరల్డ్ బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తుంపుపొందిన జాంటీ రోడ్స్ ఐదో స్థానంలో, 6వ స్థానంలో దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే వికెట్ కీపర్‌గా ఉన్న క్వింటన్ డికాక్‌ను స్టెయిన్ ఎంపిక చేశాడు. బౌలర్ల జాబితాలో ఆసీస్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ చోటు సంపాధించగా.. మిగతావారంతా దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్లే ఉన్నారు. పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్ బౌలర్ల జాబితాలో ఉన్నారు.

స్టెయిన్ అత్యుత్తమ జట్టు :
గ్రేమ్ స్మిత్, కుమార సంగక్కర, డేవ్ హాకిన్, జాక్ కలిస్, జాంటీ రోడ్స్, క్వింటన్ డికాక్, బ్రెట్ బార్గియాచి, పీటర్ లాంబార్డ్, బ్రెట్ లీ, పాల్ హరిస్, అలెన్ డొనాల్డ్.

ఆస్టన్ ఆగర్ ప్రపంచ జట్టు:
ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ అగర్ కూడా ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించాడు. అగర్ తన జట్టులో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్ నుంచి చోటు దక్కించుకున్నారు. జట్టు ఇలా ఉంది.
వీరేంద్ర సెహ్వాగ్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్ లీ, షేన్ వార్న్, షోయబ్ అక్తర్, రంగనా హెరాత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications