వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. విండీస్ పై 40 పరుగుల తేడా గెలుపొందింది. విండీస్ లోని ప్రావిడెన్స్ లో జరిగిన టెస్ట్ లో దక్షిణ దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 160 పరుగులకే అలౌట్ అయింది. డి.పియట్ 38 పరుగులు చేయగా.. బెడిన్ గామ్ 28, స్టబ్స్ 26, బర్గర్ 23 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ 5 వికెట్లు తీయగా.. జైడెన్ 3, హోల్డర్, మోతి ఒక్కో వికెట్ పడగొట్టారు.
వెసిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 144 పరుగులకే అలౌట్ అయింది. విండీస్ బ్యాంటర్లలో హోల్డ్ 54 పరుగులు చేయగా... కర్టీ 26, జోసెఫ్ 2 పరుగులు చేశారు. ప్రోటీస్ బౌలర్లలో మల్డర్ 4 వికెట్లు పడగొట్టగా.. బర్గర్ 3, మహారాజ్ 2, రబాడ ఒక వికెట్ తీశాడు. రెండో ఇన్నింగ్స్ సౌతాఫ్రికా మంచి స్కోర్ సాధించింది.246 పరుగులకు అలౌట్ అయింది. వెర్రియెన్నె 59 పరుగులు చేయగా.. మక్రమ్ 51, మల్డర్ 34, జోర్జి 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జైడెన్ 6 వికెట్లు తీయగా.. మోతి 2, వరికెన్ 2 వికెట్లు పడగొట్టారు.

263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 222 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాటర్లలో మోతి 45 పరుగులు చేయగా.. హోడ్జ్ 29, సిల్వ 27, బ్రాత్ వైట్ 25, వరికమ్ 25 పరుగలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా.. మల్డర్ 2, పిట్ 2 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. మొదటి టెస్ట్ డ్రా కాగా.. రెండో విండీస్ ఓడిపోయింది. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ మల్డర్ ఎంపిక కాగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా కేశవ్ మహారాజ్ ఎంపికయ్యాడు.