
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సిడ్నీలో బంగ్లాదేశ్, సౌతాఫ్రికాకు మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రూసో, డికాక్ చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది ప్రొటీస్ టీమ్. కేప్టెన్ కమ్ ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా ఆటగాళ్లు వికెట్ పడకుండా ఆడారు.
రూసో 56 బంతుల్లో 8 సిక్స్ లు, 7 ఫోర్లతో 109 పరుగులు చేయగా.. డికాక్ 38 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఒకదశలో దక్షిణాఫ్రికా మరింత భారీ స్కోర్ చేస్తుందనిపించినప్పటికీ చివరలో వెంటవెంటనే వికెట్లను కోల్పోవాల్సి రావడంతో జోరు తగ్గింది. స్టబ్స్,మక్రమ్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబుల్ హసన్ 2 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మహుముద్, హస్సేన్ ఒక్కో విటెట్ తీశారు. 206 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది.
బంగ్లా ఏ దశలోనూ విజయం వైపు ప్రయాణం చేయలేదు.లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశఆరు. 15 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ నట్రోజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. లిట్టన్ దాస్ ఒక్కడే ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు చేయగా.. మిగతా వారు వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. కెప్టెన్ షకీబుల్ హసన్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరగా.. హుస్సేన్ కూడా 1 పరుగే చేశాడు. లిట్టన్ దాస్ 31 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్ తో 34 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే 3.3 ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. శంసి మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ, మక్రమ్ ఒక్కో వికెట్ తీశారు.