Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. అధికారికంగా డికాక్ చేతికి పగ్గాలు.. దక్షిణాఫ్రికా జట్టు ఇదే!!

South Africa announce squad for T20I series against Australia; DuPlessis, Rabada return

సెంచూరియన్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో రెండు నెలల సుదీర్ఘ పర్యటనను దక్షిణాఫ్రికా ఆదివారం ముగించిన విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మరో సవాల్‌కి సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియా జట్టు సఫారీ గడ్డపై మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. మూడు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.

అధికారికంగా డికాక్ చేతికి పగ్గాలు:

అధికారికంగా డికాక్ చేతికి పగ్గాలు:

దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టు ప్రకటనకి ముందే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ తప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా క్వింటన్ డికాక్‌ చేతికి జట్టు పగ్గాలు వచ్చాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న డుప్లెసిస్ మాత్రం జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. డికాక్‌, డుప్లెసిస్, తెంబ బవుమా,హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌లతో ప్రొటీస్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.

ఎంగిడి అద్భుతం:

ఎంగిడి అద్భుతం:

సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌తో పాటు కగిసో రబాడ, లుంగి ఎంగిడిలను టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఎంగిడి అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ని 1-2తో కోల్పోయిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాకి గట్టి పోటీనివ్వాలని చూస్తోంది. నిజానికి మూడు మ్యాచులలో కూడా భారీ స్కోరే చేసింది. అయితే ఇంగ్లీష్ ఆటగాళ్లు 200పైగా స్కోర్ కూడా సాధించడంతో సిరీస్ కోల్పయింది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత మార్చి 12 నుంచి భారత్‌ గడ్డపైకి ప్రొటీస్ రానుంది.

డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం:

డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం:

దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ సోమవారమే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న డుప్లెసిస్‌.. ఉన్నపళంగా తన నిర్ణయాన్ని ప్రకటించి క్రికెట్‌ దక్షిణాఫ్రికాకు షాకిచ్చాడు. అయితే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ఆటగాడిగా అందుబాటులో ఉంటానని డుప్లెసిస్‌ వెల్లడించాడు. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ముందుకు వెళుతుందని ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. ఇంతకాలం దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా చేయడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు:

దక్షిణాఫ్రికా టీ20 జట్టు:

తెంబ బవుమా, డికాక్ (వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డుప్లెసిస్, డస్సేన్, డేవిడ్ మిల్లర్, బిల్జన్, ప్రిటోరియస్, పెహ్లుక్వాయో, స్మట్స్, కగిసో రబాడ, షంసీ, లుంగి ఎంగిడి, ఫార్చూన్, నోర్తేజ్, డేల్ స్టెయిన్.

Story first published: Monday, February 17, 2020, 21:54 [IST]
Other articles published on Feb 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+