Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో వన్డే సిరీస్.. డుప్లెసిస్ రీఎంట్రీ.. ద‌క్షిణాఫ్రికా జట్టు ఇదే!!

South Africa announce squad for ODI series against India, Faf Du Plessis returns

హైదరాబాద్: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటన ముగిసింది. ఇక భారత్ తన తర్వాత సిరీస్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈనెల 12 నుంచి ద‌క్షిణాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్‌ ఆరంభం కానుంది. ధ‌ర్మ‌శాల‌లో తొలి వ‌న్డే జ‌రుగనుండ‌గా.. 15న ల‌క్నో, 18న కోల్‌క‌తాలో రెండు, మూడు వ‌న్డేలు జ‌రుగుతాయి. అయితే సోమవారం భారత్‌తో సిరీస్‌కు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ద‌క్షిణాఫ్రికా జట్టుకు వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ క్వింట‌న్ డికాక్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. భారత్‌తో వన్డే సిరీస్ ద్వారా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పునరాగ‌మ‌నం చేస్తున్నాడు. జన్నెమాన్ మ‌లాన్ స్థానంలో డుప్లెసిస్‌ను సీఎస్ఏ ఎంపిక చేసింది. గ‌త‌డేది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ తర్వాత డుప్లెసిస్ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇదే. అయితే ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో డుప్లెసిస్‌కు చోటు ద‌క్క‌లేదు. ఇటీవ‌లే ద‌క్షిణాఫ్రికా జట్టు కెప్టెన్సీనికి డుప్లెసిస్ రాజీనామా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

వాన్ డెర్ డుసెన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. లుతో సిప్లామా, కేశ‌వ్ మ‌హారాజ్‌, కైలీ వెర్రేన్‌ తమ స్థానాలను కాపాడుకున్నారు. భార‌త ప‌ర్య‌ట‌న‌కు చైనామ‌న్ స్పిన్న‌ర్ త‌బ్రీజ్ ష‌మ్సీ దూరమయ్యాడు. త‌న భార్య ప్ర‌సవం కార‌ణంగా ఈ టూర్ నుంచి అతడు త‌ప్పుకున్నాడు. ష‌మ్సీ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ జార్జ్ లిండేకు అవకాశం ఇచ్చారు. ఇక గాయం కార‌ణంగా స్టార్ పేస‌ర్ క‌గిసో రబాడ దూర‌మైన సంగ‌తి తెలిసిందే.

భారత్ ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడి 3-0తో కోల్పోయింది. ఆ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ విజయాల బాట పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు ప్రోటీస్ టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా చేతిలో 2-1 తేడాతో కోల్పోయింది. ఇక మొదటి వన్డేలో ఆస్ట్రేలియాపై ప్రోటీస్ ఘన విజయం సాధించింది.

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు:
క్వింట‌న్ డికాక్ (కెప్టెన్‌), టెంబా బ‌వుమా, ర‌స్సీ వాన్ డ‌ర్ డ‌స్సెన్‌, డుప్లెసిస్‌, కైలీ వెర్రేన్‌, హెన్రిచ్ క్లాసెన్‌, డేవిడ్ మిల్ల‌ర్‌, జాన్ స్మ‌ట్స్‌, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూర‌న్ హెండ్రిక్స్‌, ఆన్రిచ్ నోర్జ్‌, జార్జ్ లిండే, కేశ‌వ్ మ‌హారాజ్‌.

Story first published: Monday, March 2, 2020, 18:44 [IST]
Other articles published on Mar 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+