Chris Morris: క్రికెట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని మోరిస్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. తన కెరీర్‌లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ 34 ఏళ్ల మోరిస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాకుండా మోరిస్ తన భవిష్యత్ ప్రణాళికను కూడా వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికాలోని దేశీయ జట్టైన టైటాన్స్ క్రికెట్ టీంకు కోచ్‌గా వ్యవహరించినట్టు ప్రకటించాడు. తన 12 ఏళ్ల కెరీర్‌లో మోరిస్ అంతర్జాతీయ క్రికెట్‌లో 42 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 20 సగటుతో 468 పరుగులు చేశాడు.
అత్యధిక స్కోర్ 62 పరుగులు. అలాగే 48 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4-31. ఇక 23 టీ20 మ్యాచ్‌ల్లో 14 సగటుతో 133 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 55. అదే సమయంలో 34 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4-27. అలాగే 4 టెస్టు మ్యాచ్‌ల్లో 173 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 69. 12 వికెట్లు కూడా తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3-38.
కెరీర్‌లో తన తొలి వన్డేను 2013 జూన్ 10న పాకిస్థాన్‌తో ఆడాడు. చివరి వన్డేను 2019 జూలై 6న ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇక తొలి టీ20ని 2012లో డిసెంబర్ 21న న్యూజిలాండ్‌తో చివరి టీ20ని 2019 మార్చి 24న శ్రీలంకతో ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మోరిస్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడాడు. మోరిస్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున మోరిస్ ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 81 మ్యాచ్‌లు ఆడాడు. 22 సగటుతో 618 పరుగులు చేశాడు.
ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోర్ 82 పరుగులు. అదే సమయంలో 95 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 4-23. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌ను 2013 ఏప్రిల్ 10న ఆడాడు. చివరి మ్యాచ్‌ను 2021 అక్టోబర్ 7న ఆడాడు. ఐపీఎల్ మెగా వేలంలో ఓ ఏడాది మోరిస్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. గత అక్టోబర్‌లోనే సౌతాఫ్రికా తరఫున తన కెరీర్ ముగిసినట్టేనని మోరీస్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications