For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో సంచలనం: తన గర్ల్‌ఫ్రెండ్‌తో మహిళా ఆల్‌రౌండర్ ఎంగేజ్మెంట్!

భారత క్రికెట్‌లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌లో సంచలనం చోటుచేసుకుంది. టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసి కోచ్ గౌతమ్ గంభీర్ నిద్రపట్టకుండా చేశారు. భారత్‌లో అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లోకి తిరిగి రావడం గురించి చర్చించుకుంటూ బిజీగా ఉండగా.. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు, జింబాబ్వేకు చెందిన కంటెంట్ క్రియేటర్ మిచెల్ నేటివెల్‌తో నిశ్చితార్థం చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారత క్రికెట్లో టెస్ట్ సిరీస్ ఓటమి, కోహ్లీ-రోహిత్ వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. క్లోయీ ట్రయాన్ చేసిన ఈ అనూహ్య ప్రకటన అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకున్న క్లోయీ.. తాను డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

అభిమానుల గుండెలను బద్ధలు కొట్టిన నిశ్చితార్థం
సాధారణంగా క్రీడాకారులు నిశ్చితార్థం లేదా వివాహాలు చేసుకుంటే వారి అభిమానులు సంతోషిస్తారు. కానీ క్లోయీ ట్రయాన్ ఈ ప్రకటన చేయడంతో ఆమెను ఇష్టపడే ఎంతో మంది పురుష అభిమానుల హృదయాలు బద్ధలయ్యాయి. నవంబర్ 29న క్లోయీ ట్రయాన్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిచెల్ నేటివెల్‌తో కలిసి ఉన్న అందమైన నిశ్చితార్థపు ఫోటోలను షేర్ చేసింది. క్లోయీ ట్రయాన్ మోకాలిపై కూర్చుని తన ప్రియురాలికి ఉంగరాన్ని అందించి ప్రపోజ్ చేసింది. ఈ దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మిచెల్ నేటివెల్ జింబాబ్వేలో చాలా పేరున్న వ్యక్తి.. ఆమె కంటెంట్ క్రియేటర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందింది.

South Africa All-Rounder Chloe Tryon Gets Engaged to Girlfriend Michelle Nativel

అద్భుతమైన క్రికెట్ కెరీర్: టీ20 రికార్డ్!
క్లోయీ ట్రయాన్ కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, వృత్తిపరమైన జీవితంలోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఆమె 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఆమె పేరుపై ఒక అద్భుతమైన రికార్డు ఉంది. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తన మొదటి బంతికే వికెట్ తీసిన ఏకైక ప్లేయర్ క్లోయీ ట్రయాన్. ఈ రికార్డు ఆమె బౌలింగ్ పదునుకు నిదర్శనం. ఆమె దక్షిణాఫ్రికా జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా పనిచేసింది. ముఖ్యంగా 2022 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జట్టులో కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో క్లోయీ ట్రయాన్ స్టార్ ప్లేయర్. ఆమెను 2026 ఎడిషన్ కోసం జరిగిన వేలంలో పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. ట్రయాన్, నేటివెల్ నిశ్చితార్థం క్రీడా ప్రపంచంలో క్రికెట్ అభిమానులందరికీ సంతోషాన్ని పంచింది.

Story first published: Sunday, November 30, 2025, 10:31 [IST]
Other articles published on Nov 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+