దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత్‌కు ఇద్దరు కెప్టెన్‌లు

South Afria A vs India A: Manish Pandey, Shreyas Iyer to split India A captaincy duties

ముంబై: భారత్‌ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడక ముందే.. దక్షిణాఫ్రికా-ఏతో భారత్‌-ఏ పోరు జరగనుంది. దక్షిణాఫ్రికా-ఏ జట్టు మరో వారం రోజుల్లో భారత్‌ రానుంది. ఆగస్టు 29 నుంచి మొదలయ్యే ఈ ఐదు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ సరికొత్త ప్రయోగం చేపట్టింది.

రాణించిన రహానే, విహారి.. భారత్‌, వెస్టిండీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

ఒక జట్టు.. ఇద్దరు కెప్టెన్‌లు:

ఒక జట్టు.. ఇద్దరు కెప్టెన్‌లు:

సోమవారం బీసీసీఐ భారత్‌-ఏ జట్టును ప్రకటించింది. అయితే బీసీసీఐ కొత్తగా భారత్‌-ఏకు ఇద్దరు కెప్టెన్‌లను ఎంపిక చేసింది. అంతేకాదు రెండు జట్లను కూడా ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేలకు మనీశ్‌ పాండే, చివరి రెండు వన్డేలకు శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌లుగా నియమించింది. తొలి మూడు మ్యాచులకు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ అందుబాటులో ఉంటాడు. ఆగస్టు 29, 31, సెప్టెంబర్‌ 2, 4, 8 తేదీల్లో ఈ వన్డేలు జరుగుతాయి.

బలంగా పాండే జట్టు:

బలంగా పాండే జట్టు:

శుభ్‌మన్‌గిల్‌, విజయ్‌ శంకర్‌, అన్‌మోల్‌ ప్రీత్‌, రికీ భుయ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ రాణాలు ఇద్దరు కెప్టెన్‌ల నేతృత్వంలో ఆడతారు. మనీష్ పాండే జట్టుకు ఇషాన్‌ కిషన్‌ కీపర్‌. దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా లాంటి స్టార్ పేసర్లు పాండే జట్టులో ఉన్నారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే పాండే జట్టు బలంగా ఉంది. అయ్యర్‌ జట్టుకు సంజు శాంసన్‌ కీపర్‌. వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, తుషార్ దేశ్ పాండే లాంటి యువ బౌలర్లు అయ్యర్‌కు ఉన్నారు.

First three matches:

First three matches:

Manish Pandey (captain), Ruturaj Gaikwad, Shubman Gill, Anmolpreet Singh, Nitish Rana, Ricky Bhui, Ishan Kishan (wicketkeeper), Vijay Shankar, Shivam Dube, Krunal Pandya, Axar Patel, Yuzvendra Chahal, Shardul Thakur, Deepak Chahar, Khaleel Ahmed.

Last two matches:

Shreyas Iyer (captain), Shubman Gill, Prashant Chopra, Anmolpreet Singh, Ricky Bhui, Sanju Samson (wicketkeeper), Nitish Rana, Vijay Shankar, Shivam Dube, Washington Sundar, Axar Patel, Rahul Chahar, Shardul Thakur, Tushar Deshpande, Ishan Porel.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 20, 2019, 10:53 [IST]
Other articles published on Aug 20, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more