Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా హార్దిక్‌ వద్దని తేల్చిచెప్పిన రోహిత్.. గంభీర్ రియాక్షన్ ఇదే!

మరో పది రోజుల్లో శ్రీలంకతో భారత్ సమరం ప్రారంభంకానుంది.మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. లంకతో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కానున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బీసీసీఐ అతిత్వరలో రిలీజ్ చేయనుంది. అయితే హార్దిక్ పాండ్యను కాదని సూర్యను టీ20లకు కెప్టెన్‌గా నియమించడంపై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎందుకంటే రోహిత్ శర్మ అనంతరం భారత భవిష్యత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అని భావిచారంతా. గత కొంతకాలంగా రోహిత్ గైర్హాజరీలో జట్టు బాధ్యతలను స్టాండ్‌బై కెప్టెన్‌‌గా హార్దిక్‌యే చూసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక పొట్టి ఫార్మాట్‌లో హార్దిక్‌ను అధికారిక కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు.

Sources Reveal Gambhir and Rohit Endorse Suryakumar Yadav for Team India s T20I Captaincy

కానీ శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు హార్దిక్‌ను కాదని సూర్యకుమార్‌ను సారథిగా నియమించాలని బోర్డు నిర్ణయించిందని తెలుస్తోంది. అంతేకాదు, టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగుతాడని సమచారం. అయితే హార్దిక్ పాండ్యకు కెప్టెన్‌గా బాధ్యతలు ఇవ్వకూడదని బీసీసీఐకి, సెలక్షన్ కమిటీకి రోహిత్ శర్మనే సూచించాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాలని రోహిత్ అభ్యర్థించడంతో హార్దిక్‌ను పక్కనపెట్టారని రాసుకొచ్చింది. రోహిత్ సిఫార్సును సెలక్షన్ కమిటీతో పాటు నయా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అంగీకరించాడని తెలిపింది. హార్దిక్ సారథి బాధ్యతలపై అసంతృప్తితో పాటు, హార్దిక్ ఫిట్‌నెస్, పనిభారాన్ని, టీ20ల్లో సూర్య కీలకపాత్రను రోహిత్ వివరిస్తూ ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు విభేదాలు మరోసారి మొదలయ్యాయని నెట్టింట్లో చర్చ మొదలైంది.

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌ను నడిపించిన హార్దిక్ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయిన విషయం తెలిసిందే. రోహిత్, బుమ్రా, సూర్య జట్టులో ఉన్నప్పటికీ ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగన స్థానంలో నిలిచింది. రోహిత్‌ను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌గా చేయడంపై సూర్య సోషల్ మీడియా వేదికగా, బుమ్రా మైదానంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, July 17, 2024, 19:55 [IST]
Other articles published on Jul 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+