భారత కోచ్‌గా రవిశాస్త్రి: దాదాకి అడ్డు తగిలి చక్రం తిప్పిన సచిన్
హైదరాబాద్: గతేడాది అనిల్ కుంబ్లేని కోచ్‌గా నియమించడంలో సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు రవిశాస్త్రిని కోచ్‌గా నియమించడం వెనుక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నిజానికి రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సుముఖంగా లేడు.
అసలు దరఖాస్తే చేయనని చెప్పిన రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని చెప్పడం అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచింది. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ మొత్తం ఎపిసోడ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీయే సూత్రధారియా లేక మరెవరికైనా సంబంధం ఉందా? అంటే ఓ ఆసక్తికర కోణం బయటకు వచ్చింది.

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించిన సచిన్
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... రవిశాస్త్రితో మాట్లాడి అతన్ని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఒప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం ఇంటర్వ్యూలు ముగిసిన అనంతరం సచిన్ రవిశాస్త్రి వైపు మొగ్గడంతో పాటు మిగతా ఇద్దరు సభ్యులైన గంగూలీ, లక్ష్మణ్‌లను ఒప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి విషయంలో ముందు నుంచి దాదా వ్యతిరేకత
కోచ్‌గా రవిశాస్త్రి విషయంలో ముందు నుంచి వ్యతిరేకతతో ఉన్న దాదా... సెహ్వాగ్ పేరుని బలంగా తెరపైకి తెచ్చాడంట. అంతేకాదు సెహ్వాగ్‌ను కోచ్‌గా నియమించాలని తన అభిప్రాయాన్ని వెల్లడించనట్లు సమాచారం. అయితే కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టులోని ఆటగాళ్లు రవిశాస్త్రి విషయంలో సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని సచిన్ దాదాకు వివరించాడు.

జట్టు నిర్ణయాన్ని గౌరవించాలి
అంతేకాదు జట్టు నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా గంగూలీకి వివరించే ప్రయత్నం చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తనకు సాయంగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌ను ఎంచుకుంటానని రవిశాస్త్రి ప్రతిపాదించగా.. అతడి విషయంలో దాదా ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి కోరుకున్న భరత్ అరుణ్ కాదన్నాడు
ప్రధాన కోచ్ పదవిలో తన మాట నెగ్గకపోవడంతో, బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం రవిశాస్త్రి కోరుకున్న భరత్ అరుణ్‌ను కాదని జహీర్‌ఖాన్ పేరుని తెరపైకి తీసుకొచ్చాడంట. అతన్ని బౌలింగ్ కోచ్‌గా నియమించడానికి అంగీకరిస్తేనే, రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని గంగూలీ మెలిక పెట్టాడంట.

బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా రాహుల్ ద్రవిడ్
ఈ నేపథ్యంలో చేసేదేమి లేక సచిన్, లక్ష్మణ్ సరే అన్నట్లు తెలిసింది. మరోవైపు విదేశీ పర్యటనల్లో ప్రత్యేకంగా బ్యాటింగ్ కన్సల్టెంట్ అంటూ ద్రవిడ్‌ను నియమించి.. రవిశాస్త్రి పాత్రను పరిమితం చేసే ప్రయత్నం చేశాడు. రవిశాస్త్రి పట్ల తీవ్ర వ్యతిరేకతో ఉన్న గంగూలీని ఒప్పించడంలో సచిన్ సఫలమయ్యాడని బోర్డు వర్గాలు తెలిపాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications