Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలిసారి మీడియా సమావేశం.. బ్లేజ‌ర్‌ ధరించిన గంగూలీ.. ఎందుకో తెలుసా?!!

Sourav Ganguly wears India blazer during his first press meet as BCCI president, Heres the reason

ముంబై: ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగింది. బోర్డు మీటింగ్‌ అనంతరం సౌర‌వ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడారు. దాదా మీడియా స‌మావేశానికి టీమిండియా బ్లేజ‌ర్ వేసుకుని వచ్చారు.

అప్పటి బ్లేజ‌ర్ రోజు ధ‌రించాలనుకున్నా

అప్పటి బ్లేజ‌ర్ రోజు ధ‌రించాలనుకున్నా

మీడియా స‌మావేశానికి టీమిండియా బ్లేజ‌ర్ ఎందుకు వేసుకొచ్చారో సౌర‌వ్ గంగూలీ వివరణ ఇచ్చారు. గంగూలీ మాట్లాడుతూ... 'నేను 2000 సంవత్సరంలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో ఈ బ్లేజ‌ర్ నాకు ఇచ్చారు. అప్పటి బ్లేజ‌ర్‌ను ఈ రోజు ధ‌రించాల‌ని నిర్ణ‌యింకున్నా. కానీ.. బ్లేజ‌ర్‌ చాలా లూజ్‌గా ఉన్న విష‌యాన్ని మాత్రం గ్రహించ‌లేక‌పోయా' అని విలేకరులతో నవ్వుతూ చెప్పారు.

బీసీసీఐ పదవి గౌరవంగా భావిస్తున్నా

బీసీసీఐ పదవి గౌరవంగా భావిస్తున్నా

'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే ఇక్కడ ఉన్నాం. క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బీసీసీఐ నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి లోపం ఉండదు. బోర్డులో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌కుండా చర్యలు తీసుకుంటాం. అంద‌రికీ బోర్డు ఒకేలా ఉంటుంది. నేను టీమిండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన త‌ర‌హాలోనే.. బీసీసీఐని కూడా ముందుకు న‌డిపిస్తా' అని గంగూలీ అన్నారు.

కోహ్లీకి మ‌ద్ద‌తు ఇస్తాం

కోహ్లీకి మ‌ద్ద‌తు ఇస్తాం

'ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడికి అన్ని విధాలా మ‌ద్ద‌తు ఇస్తాం. కోహ్లీతో రేపు సమావేశమవుతా. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అద్భుత విజయాలను సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందున భారత జట్టు కెప్టెన్‌, కోచ్‌ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదు' అని దాదా పేర్కొన్నారు.

ధోనీతో మాట్లాడుతా

ధోనీతో మాట్లాడుతా

'భారత క్రికెట్‌లో ఎంఎస్‌ ధోనీది ప్రత్యేక స్థానం. ఆటగాడిగా, కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. అతని పట్ల భారత్‌ గర్వంగా ఉంది. ధోనీ రిటైర్మెంట్‌ విషయం అతడి చేతుల్లోనే ఉంది. కెరీర్‌ గురించి అతడి ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. ధోనీతో మాట్లాడుతా' అని దాదా చెప్పుకొచ్చారు.

 2008లో ఆటకు వీడ్కోలు:

2008లో ఆటకు వీడ్కోలు:

గంగూలీ కెరీర్‌లో 113 టెస్ట్‌లు, 311 వన్డేలు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసాడు. గంగూలీ కెరీర్‌ 1996లో టెస్ట్‌ల్లో ఆడడం ప్రారంభించాక కొత్త శిఖరాలకు చేరింది. 2000 నుంచి 2005 వరకు భారత సారథిగా వ్యవహరించిన దాదా.. 2008లో ఆటకు వీడ్కోలు పలికాడు. 2003లో టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లాడు. రిటైర్మెంట్ అనంతరం కొద్ది సీజన్ల పాటు ఐపీఎల్‌లో ఆడాడు. ఇక 2015లో తొలిసారి క్యాబ్‌ చీఫ్‌గా ఎన్నికైన గంగూలీ ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో ఉన్నాడు.

Story first published: Wednesday, October 23, 2019, 18:04 [IST]
Other articles published on Oct 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+