For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సౌరవ్ గంగూలీ సీటుకు ఎర్త్ పెట్టిన కర్ణాటక ప్లేయర్లు - జస్ట్ కోఇన్సిడెన్సేనా?

Sourav Ganguly was removed as captain and BCCI President and replaced by Karnataka players.

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కేప్టెన్, లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కథ దాదాపు ముగిసినట్టే. రెండోసారి ఆయన ఈ బాధ్యతలను స్వీకరించడానికి అంగీకరించట్లేదు. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవడం వైపే మొగ్గు చూపారు. ఉద్దేశపూరకంగా గంగూలీని తప్పించారంటూ వార్తలొస్తోన్నాయి. బీసీసీఐలో పేరుకుపోయిన రాజకీయాలకు బలి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

బిన్నీ లాంఛనప్రాయమే..

బిన్నీ లాంఛనప్రాయమే..

బీసీసీఐ అధ్యక్ష పదవికి ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయకపోవచ్చు సౌరవ్ గంగూలీ. అదే సమయంలో బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కొనసాగనున్నారు. సౌరవ్ గంగూలీ స్థానాన్ని 1983 ప్రపంచకప్ విన్నర్ టీమ్ మెంబర్ రోజర్ బిన్నీ నియామకం కాబోతోండటం దాదాపు లాంఛనప్రాయమే. రోజర్ బిన్నీని తదుపరి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడానికి బోర్డు సభ్యులు సైతం అంగీకారం తెలిపారు.

ఐపీఎల్ లేదా

ఐపీఎల్ లేదా

కాగా- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న తరువాత సౌరవ్ గంగూలీ ఏం చేస్తారనే విషయం మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో చేరడానికి అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీలో కీలక పాత్రను పోషిస్తారనే అంచనాలు ఉన్నాయి. మెంటార్‌గా గంగూలీని తీసుకోవడానికి ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. లేదా మళ్లీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కే వెళ్తారని, అక్కడ తన సేవలను అందిస్తారని సమాచారం.

కర్ణాటక ప్లేయర్లతో..

కర్ణాటక ప్లేయర్లతో..

కాగా- సౌరవ్ గంగూలీకి కర్ణాటకకు చెందిన లెజెండరీ క్రికెటర్లు వెంటాడుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఇద్దరు- రాహుల్ ద్రావిడ్, రోజర్ బిన్నీ. గతంలో భారత క్రికెట్ జట్టు కేప్టెన్‌గా వ్యవహరించాడు గంగూలీ. 2005లో అతణ్ని తొలగించింది బీసీసీఐ. గంగూలీ స్థానంలో కర్ణాటకకు చెందిన రాహుల్ ద్రావిడ్‌కు జట్టు పగ్గాలను అప్పగించింది. 2005-2006 సీజన్‌లో చివరిసారిగా గంగూలీ జట్టుకు నాయకత్వం వహించాడు. అదే చివరి సీజన్.

నాడు ద్రావిడ్.. నేడు బిన్నీ..

నాడు ద్రావిడ్.. నేడు బిన్నీ..

ఆ తరువాత అతని స్థానంలో రాహుల్ ద్రావిడ్ జట్టుకు పూర్తిస్థాయి కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. ద్రావిడ్ సారథ్యంలో శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లను ఆడింది టీమిండియా. ఇప్పుడు తాజాగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ అపాయింట్ కాబోతోన్నారు. బిన్నీ కూడా కర్ణాటకకు చెందిన ప్లేయరే. ఈ ఇద్దరు కర్ణాటక క్రికెటర్ల ద్వారా పదవులను వదులుకోవాల్సిన వచ్చింది గంగూలీకి.

Story first published: Wednesday, October 12, 2022, 9:30 [IST]
Other articles published on Oct 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+