'దాదాగిరి'లో గంగూలీతో సందడి చేయనున్న సచిన్, అమితాబ్
హైదరాబాద్: దాదాగిరి సెట్స్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లను చాలా రోజులుగా చూడాలని అనుకుంటున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు.
ఇంతకీ దాదాగిరి ఏంటని అనుకుంటున్నారా? సౌరవ్ గంగూలీ బెంగాలీలో హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ పేరు దాదాగిరి. ఈ చాట్ షోలో తన స్నేహితుడు సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్‌లను హోస్ట్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నట్లు గంగూలీ ఈ సందర్భంగా చెప్పాడు.
'దాదాగిరి సెట్స్‌లో సచిన్, అమితాబ్‌లను చూడాలని అనుకుంటున్నా. వాళ్లను కలిసినప్పుడు ఈ విషయం అడుగుతా' అని గంగూలీ అన్నాడు. ఈ చాట్ షో ఇప్పటివరకు ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ ప్రారంభం కానుంది.

జూన్ 10 నుంచి గంగూలీ దాదాగిరి కొత్త సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 69 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ తాను క్రికెటర్నే అయినప్పటికీ, ఈ షో ద్వారా చాలా మందిని కలిసే అవకాశం దక్కిందని గంగూలీ చెప్పాడు.
ఇదిలా ఉంటే జులై 2వ తేదీన గంగూలీ వరల్డ్ క్రికెట్ కమిటీ ఎంసీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నాడు. జులై 3, 4 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ని ప్రవేశపెట్టడం, ఆస్ట్రేలియా ఆటగాళ్ల జీతాల గొడవ, నాలుగు రోజుల టెస్టులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications