For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KBC 13: యాంకర్‌గా గంగూలీ.. అమితాబ్‌ బచ్చన్‌నే హాట్‌సీట్లో కూర్చోబెట్టాడుగా! సెహ్వాగ్ ఎంత గెలిచాడో తెలుసా?

Sourav Ganguly, Virender Sehwag participates Amitabh Bachchans show KBC 13, won ₹25 lakhs

హైదరాబాద్: కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ).. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీబీ నేపథ్యంలో ఓ సినిమా కూడా బాలీవుడ్‌లో వచ్చి రికార్డులు సృష్టించింది. ఏకంగా జాతీయ అవార్డులను కూడా కొల్లగొట్టింది. హిందీలోనే కాకుండా పలు భాషల్లో కూడా ఈ షో సక్సెస్ అయింది. తెలుగులో 'మీలో ఎవరు కోటిశశ్వరుడు' పేరుతో షో విజయవంతం అయింది. 'కింగ్' నాగార్జునతో షో మరింత పాపులర్ అయింది. ఇక హిందీలో ఇప్పటి వరకు 12 సీజన్లు ముగిశాయి. శనివారం నుంచి కేబీసీ 13వ సీజన్‌ మొదలవుతోంది. తొలివారం భారత మాజీ క్రికెటర్లు అతిథులుగా రానున్నారు. అందుకు సంబందించిన ప్రోమో ప్రస్తతం నెట్టింట వైరల్ అయింది.

కేసీబీలో గంగూలీ, సెహ్వాగ్:

కేసీబీలో గంగూలీ, సెహ్వాగ్:

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లు కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 13వ సీజన్‌ తొలి వారంలో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో వైరల్‌గా మారింది. కెరీర్‌ సహా అనేక విశేషాలు పంచుకున్న దాదా, వీరూ.. ఏకంగా కేబీసీ హోస్ట్, బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్‌ బచ్చన్‌నే హాట్‌సీట్లో కోర్చుబెట్టారు. గంగూలీ అడిగిన ప్రశ్నలకు బిగ్‌బీ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ షోలో గంగులీ, సెహ్వాగ్ రూ.25లక్షలు గెలుచుకున్నారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే తాము గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం భారత మాజీలు విరాళంగా ఇచ్చారు.

బిగ్‌బీనే హాట్‌సీట్లో కూర్చోబెట్టిన దాదా:

బిగ్‌బీనే హాట్‌సీట్లో కూర్చోబెట్టిన దాదా:

కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) షో అంతలా పాపులర్ అవ్వడానికి అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఓ కారణమనే చెప్పాలి. తన వ్యాఖ్యానం, హావభావాలతో అభిమానులను ఎంతగానో ఆకటుకున్నారు. ఈ షోలో సాధారణంగా అమితాబ్‌ బచ్చన్‌ అందరినీ ప్రశ్నలడిగితే.. ఆయన సీటును సౌరవ్ గంగూలీ తీసుకొని బిగ్‌బీని హాట్‌సీట్లో కూర్చోబెట్టాడు. బిగ్‌బీకి వరుసగా క్రికెట్ ప్రశ్నలు వేశాడు. అందుకు వీరూ సాయం కూడా తీసుకోమన్నాడు. కొన్నింటికి అమితాబ్‌ సమాధానాలు చెప్పలేకపోయారు. ఇలా యాంకర్‌గా దాదా అదరగొట్టాడు. దాదా ప్రతిభను చూసిన బిగ్‌బీ.. ముగ్దుడయ్యారు. 'ఇలాగే కొనసాగితే నా పనికే ఎసరు పెడతారేమో' అని బిగ్‌బీ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి దాదా కూడా తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'ఒకవేళ నేను హోస్ట్‌గా చేయాల్సి వస్తే.. ముందుగా మీ వీడియోలు చూసి నేర్చుకుంటా' అంటూ భారత మాజీ కెప్టెన్ నవ్వులు పూయించారడు.

సెహ్వాగ్‌ హాస్యం:

సెహ్వాగ్‌ హాస్యం:

ఇక డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన రీతిలో హాస్యం పండించాడు. తాను ఆడే రోజుల్లో జట్టు సభ్యులతో, మైదానంలో ఎలా పంచులు వేశేవాడో.. కేసీబీలో కూడా అలానే సందడి చేశాడు. తన కెరీర్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇక భరత జట్టుకు అవసరమైన ప్రతిసారీ అప్పటి కెప్టెన్ అయినా సౌరవ్ గంగూలీ తనపై ఆధారపడేవాడని చెప్పుకొచ్చాడు. వేగంగా పరుగులు చేయాలన్నా, దూకుడుగా ఆడాలన్నా, ఫీల్డింగ్‌ అవసరమైనా, బౌలింగ్‌ చేయాలన్నా, జట్టుకు విజయం అందించాలన్నా తనను దాదా ఎప్పుడూ ఉపయోగించుకొనేవాడని వీరూ చెప్పాడు.

50 లక్షలు గెలవలేకపోయారు:

ఈ షోలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌ రూ.25లక్షలు గెలిచారు. అయితే రూ.50 లక్షల ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆజాద్‌ హింద్‌ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?. జపాన్‌, జర్మనీ, సింగపూర్‌, బర్మా.. ఆప్షన్స్ ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో భారత మాజీలు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. సరైన సమాధానం జర్మనీ. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం వారు విరాళంగా ఇచ్చారు. ఈ షో సాంతం ఆసక్తికరంగా సాగినట్టు సమాచారం. దాదా భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. ఇక వీరూ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు.

Story first published: Saturday, September 4, 2021, 13:04 [IST]
Other articles published on Sep 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+