రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై కోహ్లీకి ఓ చక్కటి సూచన చేసిన సౌరవ్ గంగూలీ

హైదరాబాద్: గత రెండేళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహుల్‌లు అనేక భారత విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై వీరిద్దరూ విజృంభించేవారు. అయితే, వన్డే వరల్డ్‌కప్ 2019 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో వీరిద్దరికీ చోటు దక్కడ కష్టంగా మారింది.
ఇటీవలే ముగిసిన వెస్టిండిస్ పర్యటనతో పాటు ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వీరికి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీ20 ఫార్మాట్‌లో చైనామన్ స్పిన్నర్లకు తిరిగి చోటు కల్పించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించాడు.

9వ స్థానం వరకు పటిష్టంగా ఉండాలని
దక్షిణాఫ్రికాతో టీ20 సిరిస్‌కు ముందు కుల్దీప్, చాహల్‌లను తప్పించడానికి గల కారణాన్ని కోహ్లీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్‌లో 9వ స్థానం వరకు పటిష్టంగా ఉండాలని కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు వెస్టిండిస్, దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరిస్‌లలో అవకాశమిచ్చినట్లు కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ మాట్లాడుతూ
తొలి టీ20కి ముందు కోహ్లీ మాట్లాడుతూ "లోయర్ ఆర్డర్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను బలపరిచేందుకే చాహల్, కుల్దీప్‌లకు అవకాశం కల్పించలేదు. జాతీయస్థాయిలో, ఐపీఎల్‌ల్లో మంచి పదర్శన కనబర్చిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అత్యుత్తమ జట్టును తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకే జట్టు కూర్పునకు పరిమితం కాము. ప్రస్తుతం అన్ని జట్లలలో తొమ్మిది, పది స్థానాల వరకు బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. టీమిండియా కూడా అలా ఆడడానికి ప్రయత్నిస్తున్నాం" అని చెప్పుకొచ్చాడు.

గంగూలీ రాసిన కాలమ్‌లో
ఈ నేపథ్యంలో గంగూలీ ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‍లో "టీ20 ఫార్మాట్‌లో చైనామన్ స్పిన్నర్లకు విరాట్ కోహ్లీ తిరికి చోటు కల్పించాలి. యుజ్వేంద్ర చాహల్‌కు ఇతరులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో విశ్రాంతిని కల్పించారని నేను నమ్ముతున్నాను. టీ20 ఫార్మాట్‌లో తప్పక అతడు ఉండాలి. టీ20ల్లో ఇండియాకు ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు అవసరం లేదు" అని పేర్కొన్నాడు.

రిషబ్ పంత్ ప్రదర్శనపై దాదా
కాగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నిరాశపరుస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రదర్శనపై దాదా స్పందించాడు. "అంతర్జాతీయ క్రికెట్‌లోకి రిషబ్ పంత్ అరంగేట్రం అద్భుతం. అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు అతడే సరైనా పరిష్కారం. అందరూ రిషబ్ పంత్ షాట్ సెలక్షన్‌పై మాట్లాడుతున్నారు. విరాట్ కోహ్లీ సరైన గైడెన్స్ ఇస్తే తిరిగి అతడు దారిలో పడతాడు" అని దాదా తెలిపాడు.

అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా తొలి టెస్టు
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుంది. అయితే, ఈ టెస్టు సిరిస్‌కు ముందు భారత్-దక్షిణాఫ్రికా జట్లు మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ని ఆడనున్నాయి. విజయనగరం శివారులోని డా.పీవీజీ రాజు క్రీడా మైదానంలో దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య గురువారం ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో టాస్ ఆలస్యమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications