రవిశాస్త్రి దగ్గరకు ఉదయం వెళ్లొద్దు.. ఆయనకేం గుర్తుండదు: గంగూలీ

హైదరాబాద్: కొద్ది రోజుల ముందు గంగూలీ సమయానికి రాలేదని జట్టు బస్సుతో సహా వెళ్లిపోయిందని అతనిని వదిలేశామని రవిశాస్త్రి చెప్పాడు. ఇదే విషయాన్ని గంగూలీ దగ్గర ప్రస్తావిస్తే.. చాలా హాస్యాస్పదంగా బదులిచ్చాడు. 'ఈ సారి రవిశాస్త్రి దగ్గరకు ఇంటర్వ్యూకి వెళ్తే సాయంత్రం వేళల్లో వెళ్లండి. ఉదయం వెళ్తే అతనికేమీ గుర్తుండదు. ఈ సారి రవిశాస్త్రిని కలిస్తే బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షో లో ఏం చెప్పాలో ముందే అతనికి వివరిస్తాను. కానీ, దానికి పూర్తి విరుద్ధంగా ఆయన చెప్తాడు.'
'ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే సాయంత్రం సమయంలోనే వెళ్లండి.' అని నవ్వులు గుప్పిస్తూ.. చెప్పుకొచ్చాడు. కొద్ది రోజుల ముందు పంక్చువాలిటీ గురించి తాను చాలా నిబద్ధతతో ఉంటానని చెప్పాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా గంగూలీ ఉన్న సమయంలో తాను మేనేజర్ విధులు నిర్వర్తించేవాడినని చెప్పాడు. అలా అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్న ఆయన.. 'జట్టులో ఆటగాడు తప్పు చేస్తే వారికి నేను మరో అవకాశం ఇవ్వను. సమయపాలనతో వ్యవహరిస్తే ఎప్పుడైనా మనం హుందాగా కనిపిస్తాం. ఇదో మంచి లక్షణం. టీమిండియాలో దీనికే అధిక ప్రాధాన్యం. ఆటగాళ్లందరూ తప్పక అనురించాల్సిందే. టీమ్ బస్సు తొమ్మిదింటికి స్టార్ట్ అని చెప్తే ఆ సమయానికి వెళ్లాల్సిందే. ఎవరు వచ్చారు.. ఎవరు రాలేదు అని చూడరు' అని చెప్పిన శాస్త్రి ఓ అనుభవాన్ని పంచుకున్నాడు.
2007లో నేను టీమిండియాకు మేనేజర్‌గా పని చేశాను. ఆ సమయంలో గంగూలీ జట్టుకు కెప్టెన్ బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సమయంలో.. చిట్టగ్యాంగ్ మైదానంలో ఏర్పాటు చేసిన తొలి ప్రాక్టీస్‌కు హాజరు కావల్సి ఉంది.'
'తొమ్మిది గంటలకు ఆటగాళ్లతో ఉన్న బస్సు ప్రారంభంకావాలి. బస్సు స్టార్ట్ చేయమంటే స్థానిక మేనేజర్ ఒకరు దాదా (గంగూలీ) ఇంకా రాలేదు అని అన్నారు. దాదా కారులో వస్తాడులే.. బస్సు స్టార్ట్ చెయ్యండి అని అన్నాను. మేము మైదానానికి వెళ్లాం. అప్పటి నుంచి గంగూలీ చెప్పిన సమయాని కంటే పది నిమిషాల ముందుగానే రావడం అలవాటు చేసుకున్నాడు. చాలాసార్లు ఇది గమనించాను' అని శాస్త్రి తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications