Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలో జెంటిల్‌మెన్లు ఎక్కువైపోయారు: గంగూలీ చుర‌క‌లు

ICC Cricket World Cup 2019: India vs New Zealand:Ganguly trolls VVS Laxman, Sachin,Rahul During Emis
Sourav Ganguly TROLLing Sachin Tendulkar, Rahul Dravid, VVS Laxman With ‘Gentleman’ Remark

మాంచెస్ట‌ర్‌: భార‌త క్రికెట్ జ‌ట్టులో జెంటిల్‌మెన్లు ఎక్కువైపోయారని టీమిండియా మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. త‌న మాజీ స‌హ‌చ‌రులు స‌చిన్ టెండుల్క‌ర్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌, రాహుల్ ద్ర‌విడ్‌ల‌ను ఉద్దేశించి- ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మాంచెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వ‌ర్షం వ‌ల్ల తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌ను వాయిదా ప‌డిన సంద‌ర్భంగా నిర్వ‌హించిన డిబేట్‌లో సౌర‌బ్ గంగూలీ.. ఈ ముగ్గుర్ని టార్గెట్‌గా చేసుకుని.. త‌నదైన శైలిలో చుర‌క‌లు అంటించారు. గంగూలీ ఈ వ్యాఖ్య‌లు చేస్తోన్న స‌మ‌యంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ఆయ‌న ప‌క్క‌నే ఉన్నారు. గంగూలీ మాట‌ల‌ను వింటూ స‌ర‌దాగా న‌వ్వడం క‌నిపించింది.

తాను కేప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, టెండుల్క‌ర్‌, రాహుల్‌ద్ర‌విడ్ తన ఆదేశాల‌ను పాటించే వాళ్లు కాద‌ని అన్నారు. తాము జెంటిల్‌మెన్ల‌ని వారికి వారు భావిస్తుండేవాళ్ల‌ని చెప్పారు. మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో తాను ఏదైనా ప‌ని చెబితే- రాహుల్ ద్ర‌విడ్ ముఖం మీదే నో అని చెప్పేవాడ‌ని అన్నారు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ను అడిగితే- బ్యాటింగ్‌పై దృష్టి కేంద్రీక‌రించ‌డంలో తాను బిజీగా ఉన్నాన‌ని త‌ప్పించుకునేవాడ‌ని గంగూలి చెప్పారు. ఇదే విష‌యాన్ని టెండుల్క‌ర్‌కు చెబితే- మిడ్ వికెట్ ఫీల్డ‌ర్‌కు చెప్ప‌మ‌ని సైగ‌లు చేసేవాడ‌ని పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. గ్రౌండ్‌లో త‌న ఆదేశాల‌ను త‌ప్ప‌కుండా పాటించే క్రికెట‌ర్ ఒక్క హ‌ర్భ‌జ‌న్ సింగ్ మాత్ర‌మేన‌ని అన్నారు. స‌ర్దార్‌జీ ఏది చెప్పినా నో అనేవాడు కాద‌ని గంగూలీ ప్ర‌శంసించారు.

Story first published: Wednesday, July 10, 2019, 14:41 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+