
ట్రంప్‌తో దాదా సమావేశం?
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు కార్యదర్శి జయ్ షా కూడా మొతేరా క్రికెట్ స్టేడియానికి వచ్చారు. వీరిద్దరూ స్టేడియం ప్రారంభోత్సవం అనంతరం 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో దాదా కాసేపు సమావేశం కానున్నారని సమాచారం తెలిసింది. సర్దార్ పటేల్ స్టేడియం ఇప్పటికే అభిమానులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా జనాలు సందడి చేస్తున్నారు. అమెరికా అధిపతి తొలి రాకడ సందర్భంగా యావత్ భారతం 'నమస్తే ట్రంప్' అంటూ ఆహ్వానం పలుకుతోంది.

రెడ్ కార్పెట్ స్వాగతం:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ 11 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఈ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్‌తో పాటు ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్‌కు విచ్చేసింది.

22 కిలోమీటర్ల మేర రోడ్ షో
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన కళకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌కు స్వాగతం పలికాయి. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్ షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గమధ్యంలో వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. సుమారు 30 నిమిషాల పాటు ట్రంప్ ఆయన భార్య మెలానియా, ప్రధాని ఈ ఆశ్రమంలో గడిపారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశాన్ని రాసి.. సంతకం పెట్టారు. ఆశ్రమం లోపల ఉండే హృదయ్‌కుంజ్‌లో ఏర్పాటు చేసిన చరఖాపై ట్రంప్ నూలు వడుకుతుండగా మెలానియా ఆసక్తిగా తిలకించారు. ఇక మోతేరాకు చేరుకొని స్టేడియంను ట్రంప్ ప్రారంభింస్తారు.


Click it and Unblock the Notifications












